Aishwarya Rai: భారత్‌లో అత్యంత సంపన్న నటి.. ఐశ్వర్యారాయ్ ఆస్తుల వివరాలు తెలిస్తే అవాక్కవుతారు
నటీమణుల వ్యక్తిగత వృత్తి జీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం దీపికా పదుకొనే, అలియా భట్ , కత్రినా కైఫ్ వంటి నటీమణులు బాలీవుడ్‌ను శాసిస్తున్నారు. నయనతార, సమంత, రష్మిక తదితరులకు సౌత్ సినిమాల్లో మంచి డిమాండ్ ఉంది .
నటీమణుల వ్యక్తిగత వృత్తి జీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం దీపికా పదుకొనే, అలియా భట్ , కత్రినా కైఫ్ వంటి నటీమణులు బాలీవుడ్‌ను శాసిస్తున్నారు. నయనతార, సమంత, రష్మిక తదితరులకు సౌత్ సినిమాల్లో మంచి డిమాండ్ ఉంది . గత ఐదేళ్లలో బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అలియా. సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. దీపిక, కరీనా, ప్రియాంకలు కూడా ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషకం తీసుకుంటారు. మరి ప్రస్తుతానికి భారతదేశంలో అత్యంత సంపన్నమైన హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమె గత కొన్నేళ్లుగా యాక్టింగ్ ఫీల్డ్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేవు. గత 14 ఏళ్లుగా సోలో హీరోయిన్‌గా ఒక్క హిట్టూ పడలేదు. కానీ ఆమె ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి. ఆ రిచెస్ట్ హీరోయిన్ మరెవరో కాదు నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్.
దీపికా పదుకొణె, అలియా భట్, కరీనా కపూర్ మరియు ప్రియాంక చోప్రా భారతదేశంలోని టాప్ నటీమణులు. ఒక సినిమాకు కోటి రూపాయలు వసూలు చేస్తారు. ఇక దక్షిణాదిలో అత్యంత సంపన్న నటీమణుల్లో నయనతార ఒకరు. అయితే వీరంతా ధనవంతులైన నటీమణులు కాదు. ఐశ్వర్యారాయ్ 2000 సంవత్సరం మధ్యకాలం నుండి భారతదేశపు అత్యంత సంపన్న నటిగా చెలామాణి అవుతోంది. మీడియా నివేదికల ప్రకారం ఐష్ నికర విలువ రూ.776 కోట్లు.
ఐశ్వర్య తన కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్‌కి ఎన్నో హిట్ చిత్రాలను అందించింది. తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. ఐశ్వర్య కూడా అనేక ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తుంది. ఇది కాకుండా, నటి అనేక వెంచర్లలో పెట్టుబడి పెట్టింది. దీంతో సినిమాలో నటించకుండానే ఐశ్వర్య కోట్ల రూపాయలు సంపాదించిందట. ఐశ్వర్య తర్వాత అత్యంత సంపన్న నటి ప్రియాంక చోప్రా. మీడియా కథనాల ప్రకారం ప్రియాంక నికర విలువ రూ.600 కోట్లు. దీపికా పదుకొణె మూడో స్థానంలో ఉంది. దీపిక ఆస్తి రూ.550 కోట్లు. ఆలియా మూడో స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల విలువ 500 కోట్లు.
ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ లో బచ్చన్ ఫ్యామిలీ.. వీడియో
.@SrBachchan, @juniorbachchan & #AishwaryaRaiBachchan were all in attendance to watch the #JaipurPinkPanthers win their 1st game of the Mumbai leg! 🤩
Tune-in to #PUNvCHE in #PKLOnStarSports Tomorrow, 7:30 PM onwards | Star Sports Network#HarSaansMeinKabaddi pic.twitter.com/lUE0ksnU8r
— Star Sports (@StarSportsIndia) January 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.