Aishwarya Rai: ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య, అభిషేక్.. విడాకుల రూమర్లకు చెక్ పెట్టేసిన బాలీవుడ్ స్టార్ కపుల్

బాలీవుడ్ లవ్లీ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 17 ఏళ్ల దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతున్నారంటూ సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది

Aishwarya Rai: ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య, అభిషేక్.. విడాకుల రూమర్లకు చెక్ పెట్టేసిన బాలీవుడ్ స్టార్ కపుల్
Aishwarya Rai Family
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2024 | 9:11 PM

అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ వైవాహిక జీవితంపై గత కొన్ని నెలలుగా నటి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అభిషేక్, ఐష్ ల దాంపత్య బంధంలో మనస్పర్థలు వచ్చాయని రూమర్లు వినిపించాయి. త్వరలో ఈ బాలీవుడ్ కపుల్ విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం సాగింది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పబ్లిక్‌గా కలిసి కనిపించకపోవడం వల్లే విభేదాలు వచ్చినట్లు జనాలు భావించారు. ఈ విషయంపై అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్యరాయ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గాసిప్‌లు మరీ ఎక్కువయ్యాయి. అభిషేక్, ఐశ్వర్యల వివాహమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐష్- అభిషేక్ దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకురుస్తూ అంబానీ ఫ్యామిలీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ విడివిడిగా వచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య తన తల్లితో కలిసి జీవిస్తున్నట్లు నెట్టింట గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టారు ఐష్- అభిషేక్. ఇటీవల అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీకి వెళ్లారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పార్టీలో ఉన్న వ్యాపారవేత్త అను రంజన్, నటి అయేషా జుల్కాతో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ సెల్ఫీ దిగారు. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య గొడవ జరిగి ఉంటే ఈ పార్టీకి జంటగా వచ్చేవారు కాదు. అలాగే వారు చాలా హ్యాపీగా ఫోటోకి పోజులిచ్చారు. వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ఈ ఫోటో నిరూపిస్తోంది. చాలా కాలంగా హల్ చల్ చేసిన రూమర్స్ అన్నీ ఇప్పుడు సైలెంట్ అయ్యాయి. ‘ఈ ఒక్క ఫోటో అన్నింటికి సమాధానం చెబుతుంది. కుటుంబంలోని చిన్న సమస్యకు బలమైన మహిళ విడాకులు తీసుకోదు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పార్టీలో అభిషేక్, ఐశ్వర్య,..

View this post on Instagram

A post shared by Anu Ranjan (@anuranjan1010)

కాగా ఈ పార్టీలో ఐశ్వర్య సంప్రదాయ బ్లాక్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించగా, అభిషేక్ దానిని మ్యాచ్ చేస్తూ బ్లాక్ సూట్‌లో క్లాసీగా ఉన్నాడు. మొత్తానికి ఈ ఒక్క ఫొటోతో ఈ జంట విడాకులు తీసుకోలేదు కలిసే ఉన్నారన్న క్లారిటీ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.