Tollywood: హీరో కమ్ విలన్.. అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. ఈ చిన్నోడు ఎవరో తెలుసా..

అతడి నటనకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రైనా పోషించేందుకు రెడీగా ఉంటాడు. తెలుగు, మలయాళం, తమిళం భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఎవరో తెలుసా..?

Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2024 | 5:34 PM

పైన ఫోటోలో విలక్షణ నటుడు సత్యరాజ్ చేతిలో ఉన్న చిన్నోడు ఎవరో తెలుసా.. ? తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గానూ వెండితెరపై రఫ్పాడిస్తాడు. సాధారణంగా అతడు మలయాళంలో సూపర్ స్టార్. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం విలన్ గానే పరిచయమయ్యాడు. అతడి సినిమాలు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఆ నటుడి పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతుంది. అంతేకాదు.. అతడి భార్య సైతం తెలుగులో క్రేజీ హీరోయిన్. ఆ చిన్నోడు మరెవరో కాదు.. పుష్ప 2 విలన్ భన్వర్ సింగ్ షేకావత్.. అలియాస్ ఫహద్ ఫాజిల్.

మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చిన్నప్పుడే బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. సీనియర్ నటుడు సత్యరాజ్ హీరోగా నటించిన తమిళ రీమేక్ సినిమా ‘ఎన్ బొమ్మకుట్టి అమ్మావుక్’ సినిమా లొకేషన్ లో ఈ ఫోటో తీశారు. డైరెక్టర్ ఫాజిల్ తెరకెక్కించిన కైయేతుం దూరత్ సినిమాతో ఫహద్ ఫాజిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

1992లో మమ్ముట్టి, శోభన నటించిన పప్పాస్ ఓన్ అప్పూస్ చిత్రంలో బాలనటుడిగా కనిపించారు ఫహద్ ఫాసిల్. ఆ తర్వాత హీరోగానూ మెప్పించారు. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న పుష్ప 2 చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఫహద్ ఫాజిల్ 2014 ఆగస్ట్ 21న మలయాళీ హీరోయిన్ నజ్రియా నజీమ్‏ను పెళ్లి చేసుకున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.