Bhama Kalapam: లైగర్ చేతుల మీదుగా ప్రియమణి థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ భామా కలాపం ట్రైలర్
థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’తో ప్రముఖ నటి ప్రియమణి ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు.
Bhama Kalapam: థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’(Bhama Kalapam)తో ప్రముఖ నటి ప్రియమణి( Priyamani) ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ప్రతి తెలుగు వారింటిలో భాగమైన 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా(Aha)లో అద్భుతమైన ఇంటిని భోజనంలాంటి థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ మన ముందుకు రానుంది. ప్రముఖ నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్ ద్వారా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు.
నేను వాసన చూసే కూరలో ఉప్పు ఎక్కువైందో.. తక్కువైందో చెప్పేస్తాను.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను పసిగట్టింది తప్పయ్యే ఛాన్సే లేదు’ అని అనుపమ (ప్రియమణి) తన స్నేహితురాలితో చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. కోల్‌కత్తా మ్యూజియంలోని ప్రదర్శనకు ఉంచిన రూ.200 కోట్ల విలువైన ఓ ఎగ్ (గుడ్డు) మిస్ అవుతుంది. అదెక్కండుందో కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వెతుకులాట ప్రారంభిస్తారు. ఆ గుడ్డుకి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే హౌస్ వైఫ్ అనుపమకి ఏంటి సంబంధం? కుటుంబమే లోకంగా ఉండే అనుపమ తీరిక ఉన్నప్పుడు డిఫరెంట్ వెరైటీస్ వంటలను వండి వాటిని యూ ట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. అసలు అనుపమ ఉండే అపార్ట్‌మెంట్‌కి, కోల్‌కత్తాల్లో మిస్ అయిన ఖరీదైన ఎగ్‌కు లింకేంటో తెలుసుకోవాలంటే ‘ఆహా’ ఫిబ్రవరి 11న ప్రీమియర్ కానున్న వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ చూడాల్సిందే. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘భరత్ కమ్మతో తన మొదటి సినిమా డియర్ కామ్రేడ్ సినిమా చేశాం. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను.నా కెరీర్లో నేను మరచిపోలేని చిత్రమది. బాపినీడు, ప్రసాద్ గారికి, డైరెక్టర్ అభికి అభినందనలు. ఇక ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన సూట్ అయిపోతారు. ఇప్పుడు ఆమె డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఆమె చేసిన భామా కలాపం ఒరిజినల్ ద్వారా. ఇది ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :