Adivi Sesh’s Major : దేశంలోని ప్రజలందరి హృదయాల్ని టచ్ చేసే సినిమా మేజర్ : అడవి శేష్
టాలీవుడ్ టాలెంటెడ్ అడవి శేష్ ఒకరు. ఇంట్రస్టింగ్ కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.
టాలీవుడ్ టాలెంటెడ్ అడవి శేష్ ఒకరు. ఇంట్రస్టింగ్ కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే అడవిశేష్ మేజర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించనున్నారు. సయీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ – A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది.
తాజాగా యాదవ్ శేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేజర్ దేశంలోని ప్రజలందరి హృదయాల్ని టచ్ చేసే చిత్రం అవుతుందని అన్నారు. “మేజర్ బహుభాషలలో ఒకేసారి చిత్రీకరించాం. వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు వారి సందర్భాల నుండి చిత్రీకరించిన అనేక సన్నివేశాలు ఉన్నాయి అన్నారు. ఈ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు రావడం లేదని తెలుస్తుంది.కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగు జరుపుకోలేకపోయింది. షూటింగు విషయంలో వచ్చిన గ్యాప్ ప్రభావం సహజంగానే విడుదల తేదీపై పడుతుంది. అందువలన ఈ సినిమాను ముందుగా చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :