Adipurush: ‘ఆదిపురుష్‌’ సినిమా బాలేదన్నందుకు వ్యక్తిని చితక్కొట్టిన అభిమానులు.. వీడియో వైరల్

ప్రీమియర్ షోలు పూర్తవడంతోనే ఇప్పటికే రివ్యూలు కూడా వచ్చేశాయి. సినిమా చూసిన కొందరు బాగుందంటే, మరికొందరేమో పిల్లల బొమ్మల సినిమాలా చూపించారంటూ పెదవి విరుస్తున్నారు. ప్రభాస్‌ పాన్‌ ఇండియా మువీ బాహుబలిలో ప్రభాస్ రాజు గెటప్‌లో రాయల్‌గా కనిపించిన..

Adipurush: 'ఆదిపురుష్‌' సినిమా బాలేదన్నందుకు వ్యక్తిని చితక్కొట్టిన అభిమానులు.. వీడియో వైరల్
Adipurush
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2023 | 3:13 PM

దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ మువీ ఆదిపురుష్‌. శుక్రవారం (జూన్‌ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ మువీలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌ నటించారు. ఇక తొలిరోజు థియేటర్ల వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మువీ ప్రేక్షకులను అలరించడంతో సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. తొలిరోజు షోలన్నీ హౌస్‌ఫుల్‌ అయిపోయాయంటే ఆదిపురుష్‌ రికార్డులు తిరగరాసేలా ఉంది. గత ఏడాది విడుదలచేసిన ఈ మువీ టీజర్‌ చూసి పలువురు విమర్శలు చేశారు. చిన్నపిల్లల యానిమేషన్‌ సినిమాలా ఉందని, అసలు థియేటర్లకు వచ్చి ఎవరైనా చూస్తారా అంటూ ఘోరంగా ట్రోల్స్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం ట్రైలర్‌ విడుదలైన తర్వాత ఆ విమర్శలన్నీ పటాపంచలైపోయాయి. అభిమానుల్లో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతటా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

ప్రీమియర్ షోలు పూర్తవడంతోనే ఇప్పటికే రివ్యూలు కూడా వచ్చేశాయి. సినిమా చూసిన కొందరు బాగుందంటే, మరికొందరేమో పిల్లల బొమ్మల సినిమాలా చూపించారంటూ పెదవి విరుస్తున్నారు. ప్రభాస్‌ పాన్‌ ఇండియా మువీ బాహుబలిలో ప్రభాస్ రాజు గెటప్‌లో రాయల్‌గా కనిపించిన విషయం తెలిసిందే. తాజా మువీ ఆదిపురుష్‌లో ప్రభాస్‌కు రాముడి వేషం సెట్‌ కాలేదని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద ఆదిపురుష్ చూసిన ఓ వ్యక్తి సినిమా బాలేదంటూ పలు యూట్యూబ్ ఛానళ్లకు కెమెరా ముందూ రివ్యూ చెప్తున్నాడు. దీంతో ప్రభాస్ అభిమానులు అతనిని ఐమ్యాక్స్ థియేటర్ వద్దే చితక్కొట్టారు.

ఇవి కూడా చదవండి

ఆచార్యలో గ్రాఫిక్స్ మధ్య చిరంజీవిని ఏవిధంగా చూపించారో.. ఆదిపురుష్‌లో కూడా ప్రభాస్‌ను థ్రీడీలో చూపించారని, ప్లే స్టేషన్లో కనిపించే రాక్షసుల్ని దించేశారని, హనుమంతుడు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ తప్ప మరేం బాలేదని చెప్తుండగా మధ్యలోనే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అతడిపై ఫైర్‌ అయ్యారు. ఏం చూసి సినిమా రివ్యూ చెప్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఆ వ్యక్తిపై దాడి చేసి చితక్కొట్టారు. చుట్టుపక్కలవారు అడ్డుకోవడంతో గొడవ సర్దుమనిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?