Tollywood : దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు.. హీరోయిన్ కామెంట్స్..
ఇటీవల కాలంలో తమిళ్ హీరోహీరోయిన్ల ఇంటికి బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. అజిత్, త్రిష, ఖుష్బూ, నయనతార వంటి స్టార్స్ ఇళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

సినీరంగంలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న తారలు.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో ఆదా శర్మ ఒకరు. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించి మెప్పించింది. ఇప్పుడు ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ది కేరళ స్టోరీ. 2023లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
ఈ మూవీ సినీ, రాజకీయ రంగాల్లో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విడుదలకు ముందే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో దేశంలో సగం మంది తనను చంపాలనుకున్నారని ఆదా శర్మ వెల్లడించారు. రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్ కు మరింత విలువ పెరుగుతుందని.. 1920 సినిమాతో తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని అన్నారు. ఫస్ట్ సినిమానే పెద్ద సాహసోపేతమని.. ది కేరళ స్టోరీ విడుదలయ్యే వరకూ తనకు మంచి స్క్రిప్ట్ ఎప్పుడూ వస్తుందా అని ఎదురుచూసినట్లు తెలిపింది.
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
ది కేరళ స్టోరీ, బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమాలు విడుదలైనప్పుడు బెదరింపులు ఎదుర్కొన్నానని.. ఆ సమయంలో దేశంలో సగం మంది తనను చంపాలని కోరుకున్నారని.. మరికొందరు తనపై ప్రశంసలు కురిపించి తనను కాపాడారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆదా శర్మ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..




