Yamuna: వ్యభిచారం ఆరోపణలు, సూసైడ్ టెండెన్సీ.. ఒక్క నిర్ణయంతో మారింది యమున జీవితం
నేను చనిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి? అని స్నేహితులు సూచించారు. వారికోసం బత్రికేందుకు మనోధైర్యాన్ని నింపుకున్నాను అని యమున తెలిపారు.
సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన నటి యమున. ‘మౌన పోరాటం’ మూవీ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అందం, అభినయంతో తన మార్క్ చూపించింది. ఫ్యామిలీ హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంది. అయితే 2011లో బెంగళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఆమె పట్టుబడిందన్న వార్త అప్పుట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ కేసులో విటుడుగా సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఈవోను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు సర్కులేట్ అయ్యాయి. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యింది. సూటి పోటి మాటలు భరించలేక.. మీడియాకు కూడా దూరంగా జరిగారు. అయితే మౌనాన్ని బ్రేక్ చేస్తూ… ఆమె ఓ ఇంటర్వ్యూలో తనలోని బాధను, ఆవేదనను బయట ప్రపంచంతో పంచుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే ఇరికించారని ఆమె కంటతడి పెట్టుకున్నారు.
లేని పోని అబాంఢాలు తనపై వేశారని యమున ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఆ హోటల్ కి వెళ్లలేదని తెలిపారు. వ్యభిచారి అన్న మచ్చతో బ్రతకాలనిపించలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని వెల్లడించారు. తాను చనిపోతే పిల్లలకు చెడ్డపేరు రాకుండా ఉంటుందని భావించానని, సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. పిల్లలకు ఆస్తులు వీలునామా రాసి.. తాను జీవితం చాలించాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఓ స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేయడంతో.. ఆ ఆలోచన విరమించుకున్నట్లు వెల్లడించారు. పిల్లల కోసం మనోధైర్యాన్ని నింపుకున్నట్లు తెలిపారు.
ఎదుటివారి మాటలు అస్సలు పట్టించుకోకూడదని.. మనం ఏంటో మనకి తెల్సు అన్నది చాలా పుస్తకాలు చదివి నేర్చుకున్నట్లు యమున వెల్లడించారు. నా అనుమతి లేకుండా.. ఎవ్వరూ నా ఎమోషన్స్ టచ్ చేయలేరు అనేది మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయినట్లు తెలిపారు. ఇంకో క్షణం కూడా మనం బ్రతకి ఉండలేం అనే పరిస్థితులు వస్తాయ్.. కానీ అవన్నీ క్షణికావేశాలే.. ఆ మూమెంట్ దాటితే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదే అవుతుంది. యమునాని చూడండి షీ ఈజ్ ట్రూ ఫైటర్. అప్పుడు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే.. పిల్లలు, భర్తతో ఎంత అందమైన జీవితం మిస్ చేసుకునేది. ఇప్పుడు ఎంతో చక్కగా మళ్లీ సిరియల్స్ కూడా చేస్తుంది. అందుకే క్షణికమైన నిర్ణయాలు తీసుకోకండి. ఎలాంటి పెద్ద సమస్యకి అయినా సొల్యూషన్ ఉంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి