AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidyullekha Raman: బికినీ ఫోటోను షేర్ చేసిన నటి.. నెటిజన్లు అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన విద్యుల్లేఖ..

తెలుగు, తమిళ్ భాషల్లో తన నటనతో ఆకట్టుకుంటున్న నటి విద్యుల్లేఖ రామ‌న్. ఫీమేల్ కమెడియన్‌గా తెలుగులో మంచి గుర్తింపు తెచుకుంది విద్యులేఖ.

Vidyullekha Raman: బికినీ ఫోటోను షేర్ చేసిన నటి.. నెటిజన్లు అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన విద్యుల్లేఖ..
Vidyullekha Raman
Rajeev Rayala
|

Updated on: Oct 05, 2021 | 1:28 PM

Share

Vidyullekha Raman: తెలుగు, తమిళ్ భాషల్లో తన నటనతో ఆకట్టుకుంటున్న నటి విద్యుల్లేఖ రామ‌న్. ఫీమేల్ కమెడియన్‌గా తెలుగులో మంచి గుర్తింపు తెచుకుంది విద్యులేఖ. చాలా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఒకప్పుడు బొద్దుగా ఉన్న విద్యుల్లేఖ చాలా కష్టపడి సన్నగా మారింది. ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి పేరును సాధించుకున్నారు. ఇక ఈ అమ్మడు ఇటీవలే పెళ్లిపీటలు ఎక్కింది. సంజయ్‌ అనే వ్యక్తితో విద్యులేఖ వివాహం జరిగింది. ఇక విద్యుల్లేఖ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా విద్యులేఖ పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.

హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు బికినీతో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం భర్త తో కలిసి విదేశాల్లో హనీమూన్ లో ఉంది విద్యులేఖ రామన్.. ఈ క్రమంలో ఓ బికినీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు తన ఫోటోకి రకరకాల కామెంట్లు పెడుతున్నారని.. కొందరు విడాకులు ఎప్పుడు?’ అని మెసేజ్‌ చేస్తున్నారని తెలిపింది. అలాగే దీనిపై స్పందిస్తూ.. 1920 నుంచి 2021లోకి రండి. సమాజంలోని ఆలోచనా విధానమే పెద్ద సమస్య. ఒకవేళ ఆడవాళ్లు వేసుకునే బట్టలే  విడాకులకు కారణం అయితే… సంప్రదాయంగా బట్టలు వేసుకునే వారంతా  వైవాహిక జీవితాల్లో సంతోషంగా  ఉన్నారా? అని ప్ర‌శ్నించింది. అదేవిధంగా సంజయ్‌ లాంటి భర్త లభించడం నా అదృష్టం అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది విద్యులేఖ.Raman

View this post on Instagram

A post shared by Vidyu Raman (@vidyuraman)

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: మా లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి.. కండిష‌న్స్ ఇవే..

MAA Elections 2021: సిని’మా’ వార్.. రాజకీయం, సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లిన ‘మా’ సమరం..

హతవిధీ.. ఒకరితర్వాత మరొకరు.. టాలీవుడ్‌కి ఇదో కొత్త గండం..! ఎందుకిలా జరుగుతుంది..!!