Varalakshmi SarathKumar: గ్రాండ్గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్.. సందడి చేసిన సినీతారలు..
తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్దేవ్ ను వివాహం చేసుకుంది. థాయ్ లాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు.
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్గా సినీరంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. ఆ తర్వాత పవర్ ఫుల్ లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది. ఎలాంటి పాత్రలలోనై తన యాక్టింగ్, మేనరిజంతో మెప్పిస్తుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్దేవ్ ను వివాహం చేసుకుంది. థాయ్ లాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్ దేవ్ రిసెప్షన్ వేడులలో తమిళనాడు సీఎం స్టాలిన్ హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్, శోభన, రజినీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, మంచి లక్ష్మి, సందీప్ కిషన్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నికోలయ్ సచ్ దేవ్ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్ లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్స్, కళాకృతులు విక్రయిస్తుంటారు. 14 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇక ఇప్పుడు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.