Tanushree Dutta: వాళ్లు ఆ పని చేయొచ్చు.. కానీ నేను చేస్తే తప్పా..! తను శ్రీ కామెంట్స్

ఆషిక్ బనాయా అప్నే’ సినిమా టైటిల్ ట్రాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ సాంగ్ మనకు వినిపిస్తూనే ఉంటుంది. 2005లో 'ఆషిక్ బనాయా అప్నే' సినిమా విడుదలైంది. ఇందులో తనుశ్రీ దత్తా, ఇమ్రాన్ హష్మీ బోల్డ్‌గా నటించారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంది. ఈ పాట అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.

Tanushree Dutta: వాళ్లు ఆ పని చేయొచ్చు.. కానీ నేను చేస్తే తప్పా..! తను శ్రీ కామెంట్స్
Tanushree Dutta
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2024 | 2:12 PM

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బోల్డ్ సీన్స్ చేయడంలో ఫేమస్. ‘మర్డర్’, ‘ఆషిక్ బనాయా ‘, ‘అక్సర్’ వంటి సినిమాల్లో లవర్ బాయ్‌గా కనిపించి అమ్మాయిల మనసు దోచుకున్నాడు ఇమ్రాన్. అందులోనూ ‘ఆషిక్ బనాయా అప్నే’ సినిమా టైటిల్ ట్రాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ సాంగ్ మనకు వినిపిస్తూనే ఉంటుంది. 2005లో ‘ఆషిక్ బనాయా అప్నే’ సినిమా విడుదలైంది. ఇందులో తనుశ్రీ దత్తా, ఇమ్రాన్ హష్మీ బోల్డ్‌గా నటించారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంది. ఈ పాట అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ సాంగ్ గురించి తాజాగా నటి తను శ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి :  స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?

తాజాగా తనుశ్రీ దీనిపై మాట్లాడుతూ. ‘ముద్దు సన్నివేశంలో, రొమాంటిక్ సీన్స్ లో పెద్ద పెద్ద స్టార్స్ నటించారు. అలాంటి వారిని ఎవరూ ఏమీ అనరు. నేను అలా చేస్తే అందరికీ సమస్యలు వస్తాయి. నేను పొట్టి డ్రెస్ వేసుకున్నా, ఏదైనా సీన్ చేసినా. అది నా పర్సనల్, నా సినిమా కోసం చేస్తున్నాను. నాకు, ఇమ్రాన్ హష్మీకి మధ్య ఎలాంటి పర్సనల్స్ లేవు. నాకు, ఇమ్రాన్‌కి మధ్య కెమిస్ట్రీ బ్రదర్ సిస్టర్‌లా ఉండేది. దీని పై కూడా కొందరు రాద్ధాంతం చేస్తున్నారు’ అని తనుశ్రీ దత్తా అన్నారు.

ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

దర్శకుడు సీన్‌ని వివరించినప్పుడు తనుశ్రీకి ఎలా అర్థమైందో తెలియదు. నా తలలో వేరే కథ నడుస్తోంది. అతని తలలో వేరే కథ నడుస్తోంది’ అని ఇమ్రాన్ హష్మీ గతంలో అన్నారు. ఇక తనుశ్రీ దత్తా ఒక్కో కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మీటూ క్యాంపెయిన్ ద్వారా కూడా ఆమె పెద్ద హడావిడి చేసింది. కాగా తనుశ్రీ దత్తాకు తొలినాళ్లలో మంచి డిమాండ్ ఉండేది. ‘ఆషిక్ బనాయా అప్నే’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బోల్డ్ గా కనిపించింది. ఆ తర్వాత సైలెంట్ అయిపొయింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా మీటూ ప్రచారంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ‘ఆషిక్ బనాయా అప్నే’ సినిమాలో తనుశ్రీ బోల్డ్‌గా కనిపించి రెండు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు దీనిపై ఆమె ఇలా క్రేజీ కామెంట్స్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి