Tollywood: ఓ మై గాడ్.. ‘ఒట్టేసి చెపుతున్న’ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది
ఒట్టేసి చెపుతున్నా.. 2003లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. ఆయనకు జోడిగా కనిహా నటించింది. ఆమె అసలు పేరు... దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. తను ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి...
కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి ఇలా వచ్చి అలా మాయమైపోతూ ఉంటారు. మంచి సినిమాతో గుర్తింపు వచ్చినా కూడా.. లక్ కలిసిరాక అవకాశాలు పెద్దగా రానివారు కూడా ఉంటారు. పైన మీరు ఫోటోలో చూస్తున్న బ్యూటీ ఆ కోవకు చెందినదే. ఒకప్పుడు భలే క్యూట్‌గా ఉండే ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె పేరు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. తెలుగునాట నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చెన్నై బ్యూటీ. వరుస సినిమాలతో అలరిస్తుంది అనుకున్న సమయంలో.. మ్యారేజ్ చేసుకుని సినిమాలను స్లో చేసింది. 2003 లో శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెపుతున్న మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ చిత్రంలో నటించింది. అందం, అభినయం కూడా తెలుగులో తనకి అవకాశాలు రాలేదు.
కానీ తమిళ్, మలయాళ భాషల్లో వరస సినిమాలు చేసింది దివ్య. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ పాపులారిటీ సంపాదించింది. ఇటీవల కాలంలో తమిళ్‌లో ఓ రెండు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది దివ్య . ఈ బ్యూటీ వయసు 42 సంవత్సరాలు .. అయినా కూడా యంగ్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని అందంతో నెట్టింట రచ్చ లేపుతోంది. ఈ బబ్లీ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి