Tamannaah: మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించిన తమన్నా.. ఏమన్నదంటే
తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.

తమన్నా ప్రస్తతం క్రేజీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ చిన్నది సినిమాలు తగ్గించేసింది. చివరిగా మెగాస్టార్ చిరంజీవితో కలిస్ భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ అమ్మడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుందో. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ అమ్మడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది.
అయితే గతంలో తమన్నా తనను మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ తో పిలవొద్దు అని చెప్పింది. తనకు మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఇవ్వొద్దు అని తెలిపింది. తాజాగా మరోసారి మిల్కీ బ్యూటీ ట్యాగ్ గురించి ప్రస్తావించింది. తమన్నా భాటియాను “మిల్కీ బ్యూటీ” అని పిలవడం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
‘ఓదెల 2’ సినిమా ప్రమోషన్ సందర్భంగా తమన్నాను ఓ రిపోర్టర్ ఇలా అడిగారు: “ఒక మిల్కీ బ్యూటీలో శివశక్తి ని చూడాలని ఎలా అనిపించింది.?” దీనికి తమన్నా స్పందిస్తూ, తనను “మిల్కీ బ్యూటీ” అని పిలవడం తనకు సమస్య కాదని, అయితే తన పాత్రల ద్వారా తన సామర్థ్యాన్ని చూపించడంపైనే ఎక్కువ దృష్టి పెడతానని చెప్పింది. ఆమె మాటల్లో, “నన్ను మిల్కీ బ్యూటీ అని పిలవడం గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను ఈ సినిమాలో శివశక్తి పాత్రను పోషిస్తున్నాను, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తితో కూడిన పాత్ర. నా పాత్రల ద్వారా నా నటనా సామర్థ్యాన్ని, వైవిధ్యాన్ని చూపించడమే నా లక్ష్యం.” అని తెలిపింది. ఆమె తన లుక్స్‌పై కాకుండా తన పనితనంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది తమన్నా.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..