త్వరలోనే వరుణ్ తేజ్ నయా మూవీ స్టార్ట్.. హీరోయిన్ అదిరిపోయిందిగా..
గని, గాంఢీవ ధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్.. ఇలా హ్యాట్రిక్ పరాజయాలతో ఢీలా పడిపోయాడు మెగా ప్రిన్స్. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలనే తలంపుతో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. నవంబర్ 14న మట్కా సినిమా గ్రాండ్ గా రిలీజైంది. కానీ మొదటి షో నుంచే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.

మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. 2014లో “ముకుంద” సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వరుణ్. ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 కెఎంపిహెచ్, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్, గాని , గాండీవధారి అర్జున, మట్కా సినిమాలు చేశాడు. వీటిలో కంచె,ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు వరుణ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మట్కా సినిమా నిరాశపరచడంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నడు.
వరుణ్ తేజ్ కెరీర్ లో 15వ సినిమా గా వస్తున్న ఈ సినిమాకు గాంధీ మేర్లపాక దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కోసం ఓ అందాల భామను ఎంపిక చేశారని టాక్ ఆమె ఎవరో కాదు. రితిక నాయక్. ఈ బ్యూటీ గతంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనం లో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే రితిక నాయక్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు, అందం అభినయం ఉన్నా కూడా ఎంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఓ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమాతో నైనా అటు వరుణ్ తేజ్, ఇటు రితిక నాయక్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. రితిక నాయక్ తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ సినిమాలోనూ నటిస్తుంది. ఇక రితిక నాయక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే క్యూట్ ఫోటోలు అభిమానులను తెగఆట్టుకుంటున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..