Tamannaah Bhatia: ఆ హీరోకు లవర్‌గానే కాదు సిస్టర్‌గాను నటించిన తమన్నా.. ఆయన ఎవరంటే

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ భామ. రీసెంట్ రెండు వెబ్ సిరీస్ లతో హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది మిల్కీ బ్యూటీ. ఇక ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తెలుగులోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది. మెగాస్టార్ కు జోడీగా ఈ మూవీలో కనిపించనుంది.

Tamannaah Bhatia: ఆ హీరోకు లవర్‌గానే కాదు సిస్టర్‌గాను నటించిన తమన్నా.. ఆయన ఎవరంటే
Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2023 | 2:17 PM

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మొన్నటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ లో సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో రాణిస్తుంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ భామ. రీసెంట్ రెండు వెబ్ సిరీస్ లతో హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది మిల్కీ బ్యూటీ. ఇక ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తెలుగులోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది. మెగాస్టార్ కు జోడీగా ఈ మూవీలో కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో కీర్తిసురేష్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇటీవలే ఈ సాంగ్ ను  చేశారు. ఈ పాటలో తమన్నా వేసిన హుక్ స్టెప్ చాల పాపులర్ అయ్యింది. అక్కడ చూసిన ఇప్పుడు ఇదే హుక్ స్టెప్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తమన్నా ఓ హీరో సరసన ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఇప్పుడు అదే హీరో పక్కన సిస్టర్ గా నటిస్తుంది.

ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా.. అక్కినేని హీరో సుశాంత్ . ఈ కుర్ర హీరో నటించిన కాళిదాస్ అనే సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో సుశాంత్ సిస్టర్ గా కనిపించనుంది. భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ వేదాళం మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది.Sushanth AnumoluSushanth Anumolu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.