Vijay Sethupathi: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. విలన్గా రఫ్పాడించనున్న అందాల రాశి..
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతికి ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం విడుదల పార్ట్ 2. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విప్లవ హీరోగా కనిపించాడ. ఈ సినిమా తర్వాత ఏస్, ట్రైన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రటన వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి ప్రాజెక్ట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
లేటేస్ట్ టాక్ ప్రకారం ఈసినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో కనిపించనున్నారట. అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉండే విలన్ పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇందులో ఆమె పవర్ ఫుల్ క్యారెక్టర్ అని.. ఈ పాత్ర కోసం పూరి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారని టాక్. స్క్రిప్ట్ నచ్చడంతో టబు సైతం ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది టబు. చాలా కాలం తర్వాత ఇప్పుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుంది.
ఇటీవలే హిందీలో దృశ్యం 2, భూల్ భులయ్యా 2 వంటి చిత్రాల్లె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టబు మరోసారి విలన్ పాత్రలో కనిపించనుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. పూరి జగన్నాథ్ చివరిసారిగా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :