AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: నేను పబ్లిక్ ప్రాపర్టీని కాదు.. తాప్సీ ఇలా అనేసిందేంటీ..!

తెలుగులో గ్లామరస్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఝుమందినాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

Taapsee Pannu: నేను పబ్లిక్ ప్రాపర్టీని కాదు.. తాప్సీ ఇలా అనేసిందేంటీ..!
Taapsee Pannu
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2024 | 5:05 PM

Share

టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ కు వెళ్లి అక్కడ పేరు తెచ్చుకున్నారు. తెలుగులో సక్సెస్ అయిన హీరోయిన్స్ హిందీలోనూ అదృష్టన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో తాప్సీ ఒకరు. తెలుగులో గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో మాత్రం ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అలాగే తమిళ్‌లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం తాప్సీ తెలుగులో సినిమాలు తగ్గించింది. పూర్తి ఫోకస్ ఆమె బాలీవుడ్ పైనే పెట్టింది. 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

రెగ్యులర్ హీరోయిన్‌గా వెలుగొందిన తాప్సీ.. బేబీ, పింక్, ది ఘాజీ అటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. నటి తాప్సీ‌పన్ను హిందీ సినిమాతో అరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగులోనూ ఈ అమ్మడి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక హిందీలో మిషన్ మంగళ్, చాంత్‌కి ఆంక్, తప్పట్, హసీన్ దిల్రూబా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ గా తెరకెక్కిన శభాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

తాజాగా తాప్సీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు’ అంటూ నటి తాప్సీ చేసిన బోల్డ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాప్సీ ఇటీవల ‘పాపరాజీ’ గురించి మాట్లాడింది. ఆ కామెంట్స్  వైరల్ అవుతున్నాయి. ‘నేను ప్రముఖ నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. ‘నో అంటే నో’ అని చెబితే తెరవెనుక ఉన్న మహిళలు అంగీకరించరు. నేను మొదట అమ్మాయిని. ఆ తర్వాత నటిని. నేను ఇలా అంటున్నానుని కొందరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్ గా చేస్తున్నావ్ అని కామెంట్స్ చెయ్యొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి’ అని తెలిపింది తాప్సీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..