Aay Movie: కంటెంట్ బాగుంటే సినిమా హిట్టవుతుంది.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్..

GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారని అన్నారు.

Aay Movie: కంటెంట్ బాగుంటే సినిమా హిట్టవుతుంది.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్..
Aay Movie
Follow us

|

Updated on: Aug 24, 2024 | 4:38 PM

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారికలు జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. డైరెక్టర్ అంజికే మణిపుత్ర దర్శక్తవం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఆగస్ట్ 15న విడుదలైన ఈ మూవీకి మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ, డైరెక్షన్, హీరోహీరోయిన్స్ యాక్టింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారని అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘110 స్క్రీన్‌లతో మొదలై.. 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే.. మౌత్ టాక్ బాగుంటే.. సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఆడియెన్స్ ఎంతగా ఆదరిస్తారో ఆయ్ నిరూపించింది. మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. 11 కోట్ల గ్రాస్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలను జనాలు ఆదరిస్తుంటారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్టివ్‌గా నిలిచిన టీంకు, ఎస్ కే ఎన్‌కు థాంక్స్. నితిన్ నుంచి భవిష్యత్తులోనూ ఫ్లాప్ సినిమా రాదని అనిపిస్తుంది. మా డీఓపీని చాలా కష్టపెట్టాం. ఎండాకాలంలో తీసినా.. వర్షకాలంలో సినిమా తీసినట్టుగా ఉండాలని చెప్పాం. మేం ఏం ఆశించామో దాని కంటే గొప్ప విజువల్స్ ఇచ్చారు. రామ్ మిర్యాల, అజయ్ అద్భుతమైన సంగీతాన్ని, ఆర్ఆర్‌లను ఇచ్చారు. అంజి ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది. అంజి మన మూలాల్ని మర్చిపోలేదు. అందుకే అద్భుతమైన సినిమాను తీశాడు. మళ్లీ మా బ్యానర్‌లోనే అంజి సినిమా చేస్తున్నాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘ఓ రెండేళ్ల క్రితం వాసు ఈ కథను నాకు చెప్పారు. వాసు చేసే కథలన్నీ నాకు చెబుతుంటాడు. ఆయ్ కథను నాకు చెప్పినప్పుడు చాలా నచ్చింది. కథ అయితే బాగుంది తెరపైకి ఎలా వస్తుందో తెలియదు. కానీ కథ మీద మాత్రం బన్నీ వాస్ చాలా నమ్మకంగా ఉండేవాడు. కథ నా చుట్టూ ఉండాల్సిన పని లేదు.. కథలో నేను ఉంటే చాలు అని.. నితిన్ గారు అన్నారు. ఆయన ఆలోచించే విధానమే ఆయనకు సక్సెస్‌లను తెచ్చి పెడుతున్నాయి. రామ్ మిర్యాల గారు, అజయ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అందరికీ నచ్చేసింది. మొన్న కమిటీ కుర్రోళ్లు.. నిన్న ఆయ్ వచ్చింది.. అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కంటెంట్ బాగుంటే సినిమా హిట్టవుతుంది.. బన్నీ వాస్..
కంటెంట్ బాగుంటే సినిమా హిట్టవుతుంది.. బన్నీ వాస్..
పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి..
పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి..
జనం మెచ్చిన ప్రజానాయకుడిగా రాణిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్..!
జనం మెచ్చిన ప్రజానాయకుడిగా రాణిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్..!
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఫుల్‌గా భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఫుల్‌గా భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు
ఒక్క చెవి రింగు కోసం ఇంత మంది వెతుకుతున్నారా.. అసలు ఏం జరిగిందంటే
ఒక్క చెవి రింగు కోసం ఇంత మంది వెతుకుతున్నారా.. అసలు ఏం జరిగిందంటే
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
'కనులు కనులను దోచాయంటే' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..
'కనులు కనులను దోచాయంటే' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..
ఒకే రైలు టికెట్‌పై 56 రోజుల ప్రయాణం.. సర్క్యులర్ జర్నీ టికెట్‌..
ఒకే రైలు టికెట్‌పై 56 రోజుల ప్రయాణం.. సర్క్యులర్ జర్నీ టికెట్‌..
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!