AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supritha: నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను.. తను ఏం చెప్పిందంటే.?

నటి సుప్రీత తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి ఆలోచనపై, తన వ్యక్తిగత జీవితంపై, అలాగే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలపై పలు కీలక విషయాలు పంచుకుంది. తల్లికి తోడు ఉండాలని కోరుకుంటూనే, తన తల్లి నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది.

Supritha: నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను.. తను ఏం చెప్పిందంటే.?
Supritha
Ravi Kiran
|

Updated on: Feb 07, 2026 | 8:09 PM

Share

టాలీవుడ్ నటి సుప్రీత తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లిపై పలు కీలక విషయాలు పంచుకుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయంపై, తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తల్లి సురేఖ వాణికి ఒక తోడు ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నానని సుప్రీత స్పష్టం చేశారు. భవిష్యత్తులో తాను పెళ్లి చేసుకుని వెళ్లిన తర్వాత తల్లి ఒంటరిగా ఉండకూడదన్న ఆలోచన తనకు ఉందని తెలిపింది. ఈ విషయాన్ని తన తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ చర్చించినట్లు చెప్పింది.

అయితే, తన తల్లి సురేఖ వాణి మాత్రం తన దివంగత భర్త స్థానాన్ని మరెవరికీ ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని పేర్కొంది. తన పెళ్లికి ముందే తన తల్లికి పెళ్లి చేయాలనే కోరిక తనకు ఉందని, కానీ చివరికి ఆమె సంతోషమే ముఖ్యమని చెప్పింది. తన తల్లికి సరైన తోడు దొరికితే, ఆమెను చాలా బాగా చూసుకోవాలని, ఆమె కోరుకున్న ప్రతిదీ నెరవేర్చాలని ఆకాంక్షించింది. తన తల్లి ప్రేమపై తనకు ఏ మాత్రం పొసెసివ్ నెస్ ఉండదని చెప్పిన సుప్రీత.. తన పెంపుడు కుక్క కృష్ణ తన తల్లి ప్రేమను పంచుకుంటుందని సరదాగా చెప్పుకొచ్చింది. తన భాగస్వామిలో కోరుకునే లక్షణాల గురించి మాట్లాడుతూ, “నన్ను అర్థం చేసుకుంటే చాలు, భరిస్తే చాలు” అని సరదాగా బదులిచ్చారు. వంట బాగా చేస్తానని, చేపల పులుసు, పులావ్, దమ్ బిర్యానీ వంటివి చేస్తానని, చికెన్ ఫ్రైలో తాను ప్రో అని తెలిపింది.

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us