AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మిలిటరీ స్కూల్లో ఆర్మీ కెప్టెన్ లవ్ ప్రపోజల్.. అసలు ట్విస్ట్ తెలియాలంటే వీడియో చూడాల్సిందే..

దేశ సేవలో అత్యున్నత మైలురాయిని అందుకున్న వేళ.. ఓ సైనికాధికారి చేసిన పెళ్లి ప్రతిపాదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్మీ హెలికాప్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా తోటి అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చేస్తున్న చర్చ ఏంటో తెలుసుకుందాం.

Video: మిలిటరీ స్కూల్లో ఆర్మీ కెప్టెన్ లవ్ ప్రపోజల్.. అసలు ట్విస్ట్ తెలియాలంటే వీడియో చూడాల్సిందే..
Army Captain Proposes In Uniform
Krishna S
|

Updated on: Jun 04, 2026 | 8:06 AM

Share

సంవత్సరాల తరబడి పడ్డ కఠోర శ్రమను, దేశ సేవకు అంకితమయ్యే ఒక అద్భుతమైన మైలురాయిని వేడుకగా జరుపుకోవాల్సిన రోజు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. ఆర్మీ ఫ్లైట్ శిక్షణ పూర్తి చేసిన కొద్ది క్షణాలకే ఒక భారత సైనికాధికారి చేసిన మ్యారేజ్ ప్రపోజల్ ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం నెటిజన్లు దీనిపై రెండు వర్గాలుగా విడిపోయి, ఒకవైపు ప్రశంసలు, మరోవైపు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో మంగళవారం సైనిక అధికారుల గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది. ఈ వేడుక ముగిసిన వెంటనే ఆర్మీ కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన సైనిక దుస్తులలోనే అక్కడి రన్‌వేపైకి నడిచి వచ్చాడు. అక్కడ నిలిపి ఉంచిన ఆర్మీ హెలికాప్టర్ ముందు, తన కుటుంబ సభ్యులు, తోటి అధికారులు చూస్తుండగా.. మోకాలిపై కూర్చుని తన ప్రియురాలు ఆరుషికి రింగ్ చూపిస్తూ ప్రపోజ్ చేశాడు. ఈ ఆకస్మిక నిర్ణయానికి ఆశ్చర్యపోయిన ఆరుషి, అందరి చప్పట్ల మధ్య ఆ ప్రతిపాదనను అంగీకరించింది.

కెప్టెన్ ఏమన్నారంటే?

ఈ విషయంపై కెప్టెన్ భరత్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లుగా మాకు పరిచయం ఉంది. ఎంతో కష్టపడి ఈ రోజు మేమంతా పైలట్లుగా మారాము. మా జీవితంలో ఇంతకంటే పెద్ద రోజు మరొకటి ఉండదు. అందుకే నా కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన ఈ రోజును, నా కాబోయే భార్యకు కూడా జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాను. అందుకే ఇక్కడే ప్రపోజ్ చేశాను” అని తన మనసులోని మాటను పంచుకున్నారు.

సపోర్ట్ చేస్తున్నవారు ఏమంటున్నారు?

ఒకే రోజున జీవితంలోని రెండు పెద్ద సంతోషాలను జరుపుకున్నందుకు చాలా మంది నెటిజన్లు ఆ అధికారిని ప్రశంసిస్తున్నారు. ‘‘సమయాన్ని చాలా అందంగా వాడుకున్నారు, శభాష్ కెప్టెన్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విదేశాల్లో ఇలాంటివి సహజమేనని, ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.

విమర్శిస్తున్న వారి వాదన ఏంటి?

అయితే క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీ నియమాలను ఈ ఘటన ఉల్లంఘించిందని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘మిలిటరీ స్కూల్ అనేది కఠినమైన రూల్స్ ఉండే పవిత్రమైన ప్రదేశం. అక్కడ ఇలాంటి వ్యక్తిగత హంగామాలు చేయడం కరెక్ట్ కాదు’’ అని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఆర్మీ హెలికాప్టర్ ముందు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం భద్రతా పరంగా తప్పని, సదరు అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us