AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: ‘మా ఇంటి మహాలక్ష్మి’.. ఫొటోల్లో ఉన్న పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల కొద్దిరోజుల క్రితం ఒక చిన్నపాపతో ఉన్న ఫొటోను తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. 'మా కుటుంబంలోకి మరో పాప వచ్చేసింది' అని తన పోస్ట్ కు క్యాప్షన్‌ పెట్టిందీ అందాల తార. దీంతో శ్రీలీల మరో బిడ్డను దత్తత తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

Sreeleela: 'మా ఇంటి మహాలక్ష్మి'.. ఫొటోల్లో ఉన్న పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల
Sreeleela
Basha Shek
|

Updated on: May 03, 2025 | 3:26 PM

Share

వయసులో చిన్నదైనా శ్రీలీల ఆలోచనలు చాలా పెద్దవి. అందుకే పెళ్లి కాకుండానే దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూసుకుంటోందీ అందాల తార. సాధారణంగా పెళ్లి కానీ అమ్మాయిలు ఇలా పిల్లలను దత్తత తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల మూడేళ్ల క్రితం ఓ అనాథాశ్రమాన్ని సందర్శించింది. అక్కడ దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఆ ఇద్దరు పిల్లలకు తల్లిలా ఆలనా పాలన చూసుకుంటోంది శ్రీలీల. ఇదిలా ఉంటే ఇటీవల మరో పాపతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ కిస్సిక్ బ్యూటీ. ‘మా ఇంటికి మరొకరు, హృదయాలను నింపేందుకు ఈ పాప వచ్చింది’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. అసలు ఈ పాప ఎవరు? తన బంధువుల పాపనా? లేకపోతే శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుదందా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా మంది శ్రీలీల మూడో పాపను దత్తత తీసుకునేసిందని ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది శ్రీలీల.

ఇప్పుడు అదే చిన్నపాపతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది శ్రీలీల. దీంతో ఆ పాప వివరాలు చెప్పాలని చాలామంది నెటిజన్లు కామెంట్ల రూపంలో శ్రీలీలను కోరారు. దీంతో ఎట్టకేలకు ఆ పాప వివరాలను చెప్పేసిందీ అందాల తార. ‘ సోదరి కుమార్తె మా ఇంటికి కొత్త కళ తీసుకొచ్చింది. ముఖ్యంగా పిన్నిలో మరింత జోష్‌ నింపింది’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక వీడియోను షేర్ చేసింది శ్రీలీల. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

శ్రీలీల ఇన్ స్టా స్టోరీ పోస్ట్..

Sreeleela 1

Sreeleela 1

ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప2 సినిమాలో ప్రత్యేకమైన సాంగ్‌లో మెరిసింది శ్రీలీల. ఆ తర్వాత నితిన్ రాబిన్ హుడ్ లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం రవితేజతో కలిసి మాస్ జాతర అనే సినిమాలో నటిస్తోంది. అలాగే పవన్ కల్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ లో యాక్ట్ చేస్తోంది. అలాగే హిందీలో కార్తీక ఆర్యన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

చిన్నారితో శ్రీలీల..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?