టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
వైవిధ్యమైన చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న కథానా యకుడు సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న ఈయన ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుంది. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా, లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యానత ఉంది.

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను లైనప్ చేస్తున్నాడు. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఈ కుర్రహీరో. 2012లో ఏమాయ చేసావే సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శివ మనసులో శ్రుతి సినిమాతో హీరోగా మారాడు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుధీర్ బాబు. 2018 లో వచ్చిన సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు సుధీర్ బాబు.
ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరిగా మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమా పేరే జటాధర. ఆసక్తికర టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాలో ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తుందని అనౌన్స్ చేశారు.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన అందాల భామ సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు ఇప్పుడు సుధీర్ బాబు జటాధర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ చిన్నదాన్నిజటాధర సినిమాలో నటిస్తుందని అనౌన్స్ చేశారు. ఇటీవలే ఈ అమ్మడు హీరమండి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram




