Shwetha Basu Prasad: ఆ తెలుగు హీరో పదే పదే ఇబ్బంది పెట్టారు.. హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కామెంట్స్..
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఆమె సెన్సేషన్. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో తెగ ఫేమస్ అయ్యింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. కెరీర్ తొలినాళ్లల్లో చేసిన పొరపాట్లతో సినిమాలకు దూరమయ్యింది. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

శ్వేతా బసు ప్రసాద్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించి కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో శ్వేతా బసు ప్రసాద్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అందం, చూడచక్కని రూపంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ప్లాపులు ఖాతాలో వేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో కొనసాగాల్సిన సమయంలో ఊహించని వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. జీనియస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత హైదారాబాద్ లో ఓ హోటల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్ల పాటు సినిమాలకు దూరమైన ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.
ఇటీవలే శ్వేతా బసు ప్రసాద్ ఊప్స్ అబ్ క్యా అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఫిబ్రవరి 20న ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు ప్రసాద్.. తాజాగా తెలుగు సినిమా హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా సెట్ లో ఆమె వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని.. కెరీర్ పరంగానే బాగానే ఉందని తెలిపింది. కానీ తెలుగు సినిమా హీరోతో సినిమా చేస్తున్న సమయంలో ఎంతో ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చింది. అతడి హైట్ ఆరు అడుగులు అని.. ఆమె హైట్ 5.2 అడుగులు ఉండడంతో ప్రతి ఒక్కరు ఎగతాళి చేశారని తెలిపింది. ఆ తర్వాత హీరో సైతం తన హైట్ గురించి ప్రస్తావిస్తూ ఎగతాళి చేశాడని చెప్పుకొచ్చింది.
అతడు తెలుగు హీరో అయినప్పటికీ తెలుగు మాత్రం సరిగ్గా మాట్లాడలేదని.. అతడి భాష గురించి పట్టించుకోకుండా.. తన హైట్ గురించి కామెంట్స్ చేసినప్పుడు బాధ అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఏ సినిమా సమయంలో ఈ వివాదం జరిగిందనే విషయాన్ని చెప్పలేదు. తెలుగలో రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ వంటి చిత్రాల్లో నటించింది. 2016లో చివరగా విజేత చిత్రంలో నటించింది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








