- Telugu News Photo Gallery Cinema photos Will these most anticipated movies come on the announced date?
Movie Releases: ఇవి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్.. చెప్పిన డేట్‌కి వస్తాయా.?
మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్... టాలీవుడ్‌లో ఏమేం ఉన్నాయి.. అంటే టక్కున చెప్పేయగలుగుతున్నాం కానీ, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనే ఆన్సరే లూప్‌లో వినిపిస్తుంది. ఎందుకంటే ఏవీ చెప్పిన డేట్‌కి రిలీజ్ అవుతాయో, ఏవి వాయిదా పడతాయో పక్కాగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు...
Updated on: Feb 17, 2025 | 5:25 PM

మాస్ జాతర మూవీ కోసం రవితేజ ఫ్యాన్స్ తో పాటు, మాస్ మహరాజ్ కూడా వెయిటింగ్. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మేలో విడుదల చేస్తారనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దసరాకు షిఫ్ట్ అయిందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర అయినా ఈ సమ్మర్ రేసులో ఉంటుందా అంటే... కన్‌ఫర్మేషన్ ఇప్పటిదాకా లేదు. హరిహరవీరమల్లు మార్చిలో వచ్చేస్తే, ఓజీ ఎప్పుడు రావాలి?

లాస్ట్ ఇయర్ సంక్రాంతికి హనుమాన్‌తో సర్‌ప్రైజింగ్ హిట్ అందుకున్నారు తేజ సజ్జా. ఈ ఏడాది సమ్మర్‌ని మిరాయ్‌తో టార్గెట్ చేస్తారనుకున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. వస్తున్నామనో, రావట్లేదనో, వాయిదా వేసుకున్నామనో, ఫలానా తేదీకి కలుద్దామనో ఏదో ఒకటి చెప్పండి బ్రో అంటున్నారు మూవీ లవర్స్.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ రొమాంటిక్ చిత్రం రాజా సాబ్. మారుతి ఈ సినిమాకి దర్శకుడు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షిఫ్ట్ అయిపోయిందనే ప్రచారం ఆల్రెడీ గట్టిగా జరుగుతోంది.

ఈ సమ్మర్‌లో ఏప్రిల్ 10న మేం పక్కాగా వస్తామని ఖర్చీఫ్ వేసుకున్న సినిమా టాక్సిక్. ఇప్పుడు ఆ డేట్ మీద డౌట్లు పుట్టుకొస్తున్నాయి. పట్టుదల సినిమా ఫలితం తారుమారు కావడంతో నెక్స్ట్... గుడ్ బ్యాడ్ అగ్లీ మీదే హోప్స్ పెట్టుకున్నారు తల ఫ్యాన్స్. తమిళ్ నుంచి రజనీకాంత్ కూలీ మే ఫస్టుకే రావాలి. లోకేష్ మనసులో సెకండ్ థాట్ ఉందో లేదో తెలియదు.

సెప్టెంబర్‌లో అఖండ సీక్వెల్‌తో నందమూరి బాలయ్య పలకరిస్తారనే నమ్మకం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. అటు దళపతి ఆఖరి సినిమా జన నయగాన్ అక్టోబర్‌లో విడుదలవుతుందనే వార్తలున్నాయి. ఒక్కసారి డేట్లు పక్కాగా ఫిక్స్ అయి, ప్రమోషన్లు స్టార్ట్ అయితేగానీ, ఫ్యాన్స్ మనసుల్లో కుదురు ఉండదని సరదాగా అంటున్నారు క్రిటిక్స్.




