Sanjana Galrani: కొత్త అమ్మాయిలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది.. హీరోయిన్ సంజనా..
వీరితోపాటు హీరోయిన్ సంజనా గల్రానీ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిలకు చాలా అన్యాయం జరుగుతుందని.. నిర్మాతల మాటలు నమ్మి తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కొందరు అమ్మాయిలు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారని అన్నారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు రాగానే ఎంతో మంది నటులపై పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అన్ని భాషలలోనూ సినీ పరిశ్రమలో మహిళలపై అఘాయిత్యాలను నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ చిత్రపరిశ్రమలలో తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక తమకు కూడా హేమ లాంటి కమిటీ కూడా కావాలని కన్నడ నటీమణులు సీఎం సిద్ధ రామయ్యను కలిసి వినతిపత్రం అందజేసిన సంగతి తెలిసిందే. వీరితోపాటు హీరోయిన్ సంజనా గల్రానీ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిలకు చాలా అన్యాయం జరుగుతుందని.. నిర్మాతల మాటలు నమ్మి తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కొందరు అమ్మాయిలు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారని అన్నారు.
“కన్నడ చిత్ర పరిశ్రమలో నటీమణుల సంఘం ఉండాలి. ఒక సీనియర్ నటి దీనికి అధిపతిగా ఉండాలి. మరొకరు మన వయసు నటి అయి ఉండాలి. ఇందులో ప్రభుత్వం నుంచి ఒక మహిళా సాధకను కూడా కలుపుకుంటే మరింత బలంగా ఉంటుంది. సినిమా రంగంలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు చాలా అన్యాయం జరుగుతోంది. అలాంటి వారికి వారి హక్కులు ఏమిటో, అధికారం ఏమిటో, వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెప్పడానికి ఇక్కడ ఎవరూ లేరు. ‘శాండల్‌వుడ్ ఉమెన్ ఆర్టిస్ట్ అసోసియేషన్’ వారికి మార్గనిర్దేశం చేస్తుంది. కొత్త హీరోయిన్ ఎవరైనా వస్తే ఈ సంఘంలో చేరండి. అసోసియేషన్ రూల్ బుక్ చూద్దాం. కొత్తవారు తమకు వచ్చిన అవకాశాలను ఎలా చెక్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఎవరో వచ్చి నిర్మాత అని చెప్పగానే.. కొత్త అమ్మాయిలు నమ్ముతారు. ఆరు నెలల తర్వాత ఇదంతా బోగస్ అని తేలిపోతుంది. ఆ ఆరు నెలల్లో ఆ కొత్త అమ్మాయిలతో ఏం జరుగుతుంది. అదంతా కెమెరాలో చెప్పడం కుదరదు ” అంటూ చెప్పుకొచ్చింది.
“కొందరు నsకిలీ వ్యక్తుల కారణంగా కన్నడ సినీ పరిశ్రమ పేరు చెడిపోతుంది. ఇవన్నీ కొత్త ఆడపిల్లలకు నేర్పించేలా ఈ సంఘం కృషి చేయాలి. ఈ సంఘాన్ని ప్రారంభించేందుకు అనుమతించాలని సీఎంకు విన్నవించాం. సమస్యను పరిష్కరించడమే మా లక్ష్యం. కొత్త అమ్మాయిలను వేలం వేయకూడదు. చాలామంది కొత్త అమ్మాయిలు భయపడి ఇంటికి వెళ్లిపోతారు. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఆర్టిస్టుల సంఘం కావాలి” అని సంజన అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.