స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్న తెలుగమ్మాయి రీతూ వర్మ.. 

Rajeev 

14 January 2025

తెలుగమ్మాయి రీతూ వర్మ గుర్తుందా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో చేసింది. 

కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.

బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది.

ఆతర్వాత హీరోయిన్ గా మారింది. 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఈ బ్యూటీ శ్రీవిష్ణు హీరోగా చేసిన స్వాగ్ సినిమాలో నటించింది. ఇప్పుడు మజాకా సినిమాలో నటిస్తుంది. 

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రానుంది. ఈ మధ్య రీతూ వర్మ సినిమాల స్పీడ్ తగ్గించిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.