AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్జరీ చేయించుకోమని బలవంతపెట్టారు.. సమీరా రెడ్డి ఎమోషనల్ కామెంట్స్

ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమీరా రెడ్డి పుట్టింది ముంబై లో ఆమె తండ్రి తెలుగువాడు, తల్లి మహారాష్ట్ర. కాగా మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా అంతగా ఆడకపోయినా తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సర్జరీ చేయించుకోమని బలవంతపెట్టారు.. సమీరా రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
Sameera Reddy
Rajeev Rayala
|

Updated on: Jun 10, 2024 | 10:27 AM

Share

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ముద్దుగుమ్మల్లో సమీరా రెడ్డి ఒకరు. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమీరా రెడ్డి పుట్టింది ముంబై లో ఆమె తండ్రి తెలుగువాడు, తల్లి మహారాష్ట్ర. కాగా మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా అంతగా ఆడకపోయినా తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో నటించింది. ఈ సినిమాతో సమీరా రెడ్డి మంచు గుర్తింపు వచ్చింది. ఆతర్వాత మరోసారి ఎన్టీఆర్ తో అశోక్ అనే సినిమా చేసింది. ఆతర్వాత చాలా కాలం తర్వాత రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.  కాగా ఈ బ్యూటీ హిందీ సినిమాల్లో ఎక్కువాగా కనిపించింది.

తమిళ్ లో సమీరా రెడ్డి నటించిన సూర్య సన్నాఫ్ కిషన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక 2013 తర్వాత సమీరా రెడ్డి సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి చేసుకొని సెటిల్ అయిన సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సమీరా రెడ్డి శరీరంలో క్రమక్రమంగా మార్పులు వచ్చాయి. ఆ సమయంలో చాలా మంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని ఎమోషనల్ అయ్యింది.

హీరోయిన్ గా సినిమాలు చేసే సమయంలోనే శరీరంలో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో అందరూ నన్ను బూబ్ జాబ్ సర్జరీ (బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ) సర్జరీ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు. చాలా మంది చేయించుకుంటున్నారు నీకేమైంది అని నన్ను పదే పదే ఇబ్బంది పెట్టారు. నాకు అది ఇష్టం లేదు అని చెప్పినా వినేవారు కాదు. ఆసమయంలో చాలా బాధపడ్డాను అని ఎమోషనల్ అయ్యింది సమీరా రెడ్డి. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలను అని చెప్పుకొచ్చింది సమీర రెడ్డి.

సమీరా రెడ్డి ఇన్ స్టా గ్రామ్..

సమీరా రెడ్డి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..