Samantha: సమంత వర్కవుట్ వీడియోస్ చూస్తే షాకవ్వాల్సిందే.. 78 కిలోల బరువును అమాంతం..
సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో రచ్చ చేసింది సామ్.
సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో రచ్చ చేసింది సామ్. ఈ అమ్మడు నటించిన ఊ అంటావా ఊహు అంటావా పాట నెట్టింట్లో ట్రెండ్ అయ్యింది. సమంత స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయ్యారు. సమంత తన ఫిట్నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫిట్ నెస్ వర్కవుట్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సమంత వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్న తన వ్యాయమ దినచర్యను మాత్రం వాయిదా వేసుకోదు. అందుకే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల సామ్ చేసిన వర్కవుట్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తన ఇన్ స్టాలో సామ్ ముందుగా 75 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో హలో 75 నేను నిన్ను మిస్ చేశాను అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత సమంత 78 కిలోలు .. అనంతరం 80 కిలోల బరువు ఎత్తుతున్న వీడియోలను షేర్ చేసింది. ఇలా బరువులను ఎత్తేందుకు తన ఫిట్నెస్ ట్రైనర్.. జునైద్ షేక్ ఆమెను మరింత ప్రోత్సాహించారు. 78 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోకు హాహాహా.. నేను రోజు త్వరగానే మేల్కొంటాను. నిన్ను నిరాశపరచాలని నాకు లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చి నవ్వుతున్న ఎమోజీస్ షేర్ చేసింది సమంత. ఈ క్యాప్షన్ ను తన జిమ్ కోచ్ జునైద్ షేక్ గురించి రాస్తూ అతన్ని ట్యాగ్ చేసింది. ఇక సమంతవ త్వరలో డైరెక్టర్ ఫిలిప్ జాన్ తో కలిసి అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమా చేయనుంది. ఇందులో సామ్ తన సొంత డిటెక్టివ్ ఏజెన్సీని నడిపే ద్విలింగ సంపర్కురాలి పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం సామ్ యశోద సినిమా చేస్తుంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
View this post on Instagram
Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..