AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘అలా ఉంటే మనం కోరుకున్నవన్నీ మన దరి చేరుతాయి’.. సమంత ఇంట్రస్టింగ్ పోస్ట్

Samantha News: సమంత ప్రజంట్ పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలు పిక్ చేసుకుంటూ.. తన మార్కెట్ రేంజ్ ‌పెంచుకుంది. 10 నిమిషాల ఐటమ్ సాంగ్‌లో నర్తించినందుకు... కోట్లు తీసుకునే స్థాయికి సామ్ వెళ్లింది.

Samantha: 'అలా ఉంటే మనం కోరుకున్నవన్నీ మన దరి చేరుతాయి'.. సమంత ఇంట్రస్టింగ్ పోస్ట్
Samantha
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2022 | 1:10 PM

Share

Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత.. ఇప్పుడు సౌత్ ఇండియా(South India)లో టాప్ స్టార్. ఒకప్పుడు రెగ్యులర్ హీరోయిన్‌గా హీరోల పక్కన ఆడిపాడిన సామ్.. ఇప్పుడు తానే ఒక క్రౌడ్ పుల్లర్‌గా మారింది. పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలు పిక్ చేసుకుంటూ.. తన మార్కెట్ రేంజ్ ‌పెంచుకుంది. 10 నిమిషాల ఐటమ్ సాంగ్‌లో నర్తించినందుకు… కోట్లు తీసుకునే స్థాయికి సామ్ వెళ్లింది. ఇక నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల అనంతరం.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. ముఖ్యంగా మోటివేషన్ కొటేషన్స్ పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఆమె ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. ఫ్యాన్స్ ఇట్టే వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫాక్ట్(Fact) అంటూ సామ్ పెట్టిన ఓ కొటేషన్ తెగ ట్రెండ్ అవుతోంది. జీవితంలో ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంత ప్రధాన భూమిక పోషిస్తోందో ఈ కొటేషన్ ద్వారా చెప్పింది.

 ”డిసిప్లెన్‌గా ఉండాలని ఒకరు చెప్పాల్సిన పనిలేదు, క్రమశిక్షణ మనల్ని బలంగా తయారుచేస్తుంది. క్రమశిక్షణతో ఉంటే తాత్కాలిక ఆనందాలు దక్కకపోయినప్పటికీ.. మున్ముందు అంతకుమించిన ఫలితాలు దరికి చేరతాయి.  జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది కూడా. మీరు కోరుకున్నవన్నీ మీకు ఇచ్చేంతగా మిమ్మల్ని మీరు ప్రేమించడం కూడా తప్పనిసరి”  అనేది సామ్ పోస్ట్‌లోని సారాంశం.

Sam Post

ఇటీవలే ‘పుష్ప’ మూవీలో ఐటెం సాంగ్ దుమ్ములేపిన సామ్.. గుణశేఖర్ డైరక్షన్‌లో ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టు ‘యశోద’ షూటింగ్‌లో బిజీగా ఉంది. తమిళంలో ఆమె నటించిన ‘కాతు వాక్కుల రెండు కాదల్’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇవి కాక మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

Also Read: Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి

గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్‌-19 వరల్డ్‌ కప్‌‌ విజయంలో కీ రోల్..