ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా ?
రెండో దశ కరోనా ఇప్పుడు దేశాన్ని అల్లాడిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి..
రెండో దశ కరోనా ఇప్పుడు దేశాన్ని అల్లాడిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి.. సెలబ్రెటీలు మొత్తం ఇళ్ళకే పరిమితం అయిపోయారు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన విషయాలను, అరుదైన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. లైవ్ వీడియోల ద్వారా అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ బడా హీరోలందరితో నటించే చాన్స్ అందుకుంది ఈ కన్నడ భామా. ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్… సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. అలాగే శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా గ్రామ్ లో చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ కరోనా పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. ప్రియమైన కరోనా నువ్వు ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు వెళ్తావో అని ఎదురు చూస్తున్నాను అంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ట్వీట్..
View this post on Instagram
Also Read: తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్.. స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన బన్నీ..