AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh : బద్రి సినిమాలో యాక్టింగ్.. ఆ నటికి ప్రతి నెల డబ్బులు పంపుతున్న పూరి.. కారణం ఇదే..

దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన కేవలం దర్శకుడే కాకుండా ప్రతిభావంతుడైన రచయిత, నిర్మాత కూడా. 2000లో పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Puri Jagannadh : బద్రి సినిమాలో యాక్టింగ్.. ఆ నటికి ప్రతి నెల డబ్బులు పంపుతున్న పూరి.. కారణం ఇదే..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2026 | 6:36 PM

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సీనియర్ నటి రమాప్రభ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలోని కీలక మలుపులను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఆమె హైదరాబాద్‌ను వీడి మదనపల్లికి మారడానికి గల కారణాలను, తన ఆస్తులు ఎలా కోల్పోయాయో వివరించారు. ఒకప్పుడు వైభవంగా ఉన్న తన ఆర్థిక పరిస్థితి ఎలా మారిపోయిందో తెలిపారు. రమాప్రభ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో శాశ్వతంగా ఉండాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, షూటింగ్‌ల కోసమే అక్కడ ఉండేదానిని అని చెప్పారు. ఆమె తన ఆస్తులన్నీ కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “వచ్చినప్పుడు ఎందుకొచ్చింది అని ఎందుకు అడగలేదు? పోయినప్పుడు పోతుంది” అని అన్నారు. తన పేరున ప్రస్తుతం ఎటువంటి ఆస్తులు లేవని, హైదరాబాద్‌లో ఉన్న ఫ్లాట్‌ను కూడా అమ్మివేసి, ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని తన కుమారుడి పేరున రాసినట్లు తెలిపారు. ఈ పరిస్థితిలో ఆమె మదనపల్లికి మారారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

గత నాలుగు సంవత్సరాలుగా ప్రతినెలా ఐదో తేదీ లోపు రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు రమాప్రభకు పంపుతున్నారని ప్రచారం నడుస్తుందని అడగ్గా.. నిజమేనని అన్నారు రమాప్రభ. పూరీ జగన్నాధ్‌తో తమ అనుబంధం సాధారణమైనది కాదని, అది జన్మల బంధమని అన్నారు. ఆయనతో ఎక్కువ సినిమాలు చేయనప్పటికీ, 2000 సంవత్సరంలో విడుదలైన బద్రి సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని తెలిపారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన బద్రి, నేను ఇంతే, దేశముదురు వంటి చిత్రాలలో రమాప్రభ నటించారు.

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

పూరీ జగన్నాధ్ సహాయం ఎలా మొదలైందో రమాప్రభ గుర్తు చేసుకున్నారు. ఒకసారి బి. గోపాల్ దర్శకత్వంలో, గోపీచంద్ నటిస్తున్న ఆరు అడుగుల బుల్లెట్ సినిమా సెట్‌లో పూరీ జగన్నాధ్ కూడా ఉన్నారు. అప్పుడు రమాప్రభ ఆయనను చూసి, “నేను ఉన్నది గుర్తుందా?” అని అడిగారు. వెంటనే ఆయన ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత, ఒక పత్రికలో రమాప్రభ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వార్త వచ్చినప్పుడు పూరీ జగన్నాధ్ స్పందించారని ఆమె తెలిపారు. ఆయన బావమరిది రమేష్ ద్వారా స్టూడియోకు పిలిపించి, ఆమెకు సహాయం చేస్తానని చెప్పారని పేర్కొన్నారు. ఈ సహాయం తనకు దక్కాల్సినదేనని, ఒక హక్కుగా భావించానని రమాప్రభ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

వారు మళ్లీ నేరుగా మాట్లాడుకోకపోయినా, పూరీ జగన్నాధ్ సహాయం నిరంతరం కొనసాగుతోందని ఆమె తెలిపారు. ఇది “గుప్తదానం” వంటిదని, ఈ బంధం వెనుక ఏదో గొప్ప శక్తి లేదా దైవ నిర్ణయం ఉందని ఆమె నమ్ముతున్నారు. ఎలాంటి టెన్షన్లు ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఈ సహాయం తనకు చేరుతుందని, ఇది తనకు అర్థం కాని ఒక అద్భుతమని రమాప్రభ పేర్కొన్నారు. పూరీ జగన్నాధ్‌ను ఒక కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగానే చూస్తానని, ఈ సహాయం ఎప్పటికీ ఆగదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Puri Jagannadh, Rama Prabha

Puri Jagannadh, Rama Prabha

ఎక్కువ మంది చదివినవి : Meena: ఏంటీ మేడమ్ మీరు.. మీనా ఎంతవరకు చదువుకుందో తెలుసా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్.

Follow Us
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?