AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ట్రోఫీ అందించిన ప్లేయర్‌నే ఇమిటేడ్ చేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!

Virat Kohli Imitates Romario Shepherd Batting Style: ఐపీఎల్ మైదానంలో పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ, తెర వెనుక తన హాస్యచతురతతో అందరినీ నవ్విస్తుంటారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో కోహ్లీ తన సహచర ఆటగాడు రోమారియో షెపర్డ్ బ్యాటింగ్ శైలిని అనుకరిస్తూ చేసిన విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: ట్రోఫీ అందించిన ప్లేయర్‌నే ఇమిటేడ్ చేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
Virat Kohli Imitates Romario Shepherd Batting Style
Venkata Chari
|

Updated on: Apr 02, 2026 | 6:19 PM

Share

Virat Kohli Imitates Romario Shepherd Batting Style: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుతం మైదానంలోనే కాకుండా, బయట కూడా ఎంతో ఐక్యతతో కనిపిస్తోంది. 2025లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ, 2026 సీజన్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ విజయంతో ఘనంగా ప్రారంభించింది. ఈ క్రమంలోనే జట్టు సభ్యుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పేలా కోహ్లీ ఒక సరదా వీడియోను పంచుకున్నారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోమారియో షెపర్డ్ బ్యాటింగ్ కోసం వచ్చినప్పుడు క్రీజులో నిలబడే తీరును కోహ్లీ ఇమిటేడ్ చేశాడు. అచ్చం అలాగే చేసి చూపించాడు. అది చూసి షెపర్డ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

ఆర్సీబీ కీలక అస్త్రం రోమారియో షెపర్డ్..

రోమారియో షెపర్డ్ 2025 సీజన్ నుంచి ఆర్సీబీ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. బ్యాటుతోనూ, బంతితోనూ ఆయన జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ముఖ్యంగా గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అలాగే 2025 ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వికెట్ తీసి జట్టును విజేతగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి తన ఫామ్‌ను చాటుకున్నారు.

కోహ్లీ జోరు.. కుర్రాళ్లకు మార్గదర్శకం..

మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లోనే 38 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయడంలోనూ కోహ్లీ ముందుంటున్నాడు. జట్టులోని యువ స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. “నెట్స్ ప్రాక్టీస్ సమయంలో కోహ్లీతో మాట్లాడటం నా ఆటను మెరుగుపరుచుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. నేను బౌలింగ్ చేసేటప్పుడు నా ఆలోచనా విధానం ఎలా ఉంది, ఆయన బ్యాటింగ్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తారు అనే విషయాలను ఆయన స్పష్టంగా వివరిస్తారు” అని పేర్కొన్నారు.

తదుపరి పోరు చెన్నైతో..

వరుస విజయాలతో ఊపుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 5, ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ పోరులో కూడా కోహ్లీ తన బ్యాటుతో మెరిపిస్తారని, షెపర్డ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం వారే!
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం వారే!
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే
లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే
లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!