Pranitha Subhash: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్..
హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలో సమంత సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు.
టాలీవుడ్ లో నటిగా తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది క్రేజీ బ్యూటీ ప్రణీత సుభాష్. ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి ఎందుకో ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలో సమంత సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో అంతగా కనిపించలేదు.
మెయిన్ హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్గా అలరించిన ప్రణీత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. బెంగుళూరుకు చెందిన తన స్నేహితుడు నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. వీరికి కొన్ని నెలల క్రితం ఓ పాప జన్మించింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది. అలాగే కన్నడలో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. రీసెంట్ గా సెకండ్ టైం గర్భవతి అయ్యింది.
ప్రణీత సుభాష్ బేబి బంప్ తో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రణీత రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ప్రణీత పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్స్ ఈ అమ్మడికి కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ప్రణీత బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ప్రణీత సుభాష్ ఇన్ స్టా ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి