- Telugu News Photo Gallery Spiritual photos Vipritha Raja Yoga brings financial benefits to these zodiac signs
విప్రీత్ రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి ఊహించని లాభాలు!
అధిక రాజయోగాన్నే విప్రీత రాజయోగం అని కూడా అంటారు. గ్రహాల కలయిక లేదా కొన్ని సందర్భాల్లో గ్రహాల కదలికల వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే శని మీనరాశిలో ప్రత్యక్ష గమనంలో ఉన్నాడు, 2027 వరకు అక్కడే ఉంటాడు, ఈ క్రమంలోనే శని తన ఉనికిని చాటగా, ఇది సింహరాశిలో విప్రీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. దీని కారణంగా నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Dec 08, 2025 | 1:03 PM

సింహ రాశి : సింహ రాశి వారికి అధిక రాజయోగం లేదా విప్రీత యోగం వలన ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. వీరికి శని ఆరవ ఇంటిలో ఉండటం వలన ఏడవ ఇల్లుకు అధిపతి, అలాగే ఎనిమిదవ ఇంటిలో సంచారం వలన వృత్తి వ్యాపారల్లో కలిసి వస్తుంది. వ్యాపారాల్లో అత్యధిక లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తుల రాశి : తుల రాశి వారికి శని అనేక ప్రయోజనాలు చేకూర్చనున్నాడు. ఈ రాశి వారికి అధిక రాజయోగం వలన అనేక లాభాలు ఉండనున్నాయి. వీరికి ఆరవ ఇంటిలో శని అధిక యోగం ఏర్పాటు చేయడం వలన ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. కష్టపడి పని చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం సంపాదిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు పోగు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే ఛాన్స్ ఉంది. కెరీర్ పరంగా ఊహించని విధంగా అవకాశాలు అందుకుంటారు. వీరికి ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

మీన రాశి : మీన రాశి వారికి శని లగ్నంలో ఉండటం వలన అదృష్టం మీదే అవుతుంది. ఈ రాశి వారు ఈ సమయంలో గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.