AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో మేష రాశి ఫలితాలు.. వీరి జీవితంలో ఏం జరుగుతుందంటే?

డిసెంబర్ నెల పూర్తి అయ్యి, త్వరలో జనవరి కొత్త ఏడాది ప్రారంభం కాబోతుంది. దీంతో ఈ సమయంలో చాలా మంది తమకు నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతోంది. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్నింట్లో కలిసి వస్తుందా? లేదా అని తెలుసుకోవాలి అనుకుంటారు. కాగా, ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా అందబోతుందనే విషయాల గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Dec 08, 2025 | 1:05 PM

Share
మేష రాశి వారికి 2026 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయానికి వస్తే వీరు దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడి రాశి నుంచి పన్నెండవ ఇంటిలో శని సంచారం వలన వీరికి ఈ సంవత్సరంలో ఏలి నాటి శని ప్రారంభం కాయబోతుంది. దీంతో వీరికి అనేక సమస్యలు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా నిద్ర సంబంధిత సమస్యలు, కాళ్లకు సంబంధించినవి ఇలా చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా చిక్కుల్లో పడే ఛాన్స్ ఉన్నదంట. అలాగే ఈ రాశి మూడవ ఇంటిలో బృహస్పతి ఉండటం వలన గుండె సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉంటూ, సమస్య చిన్నదైనా వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

1 / 5
మేష రాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థ ఫలితాలు ఉండనున్నాయి. వీరి ఆదాయం పొదుపులు కూడా ఇలాగే ఉంటాయి. ఈ సంవత్సరం ఎక్కువగా లాభాలు పొందలేరు. గ్రహాల మద్ధతు లభించకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉద్యోగం విషయంలో జాగ్రత్త అవసరం, ఆర్థిక లాభాల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని సార్లు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు.

2 / 5
ఇక ఈ రాశి వారు 2026లో కుటుంబలో కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విభేదాలు ఎక్కువగా ఉంటాయి.  ఇక వీరికి కెరీర్ పరంగా కాస్త కలిసి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం కారణంగా వీరు ఈ సంవత్సరం కష్టపడి పని చేస్తే తప్పకుండా మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.  విద్యార్థులకు మాత్రం ఇది కష్టకాలం అనే చెప్పాలి. ఏకాగ్రతతో చదివినా మీరు ఊహించిన ఫలితాలు అందుకోలేరు. చదువుపై చాలా శ్రద్ధ పెట్టాలి. క్రమశిక్షణ తప్పనిసరి

3 / 5
2026 సంవత్సరంలో వ్యాపారస్తులకు కూడా అంగా కలిసి రాదు. కష్టపడినప్పటికీ కూడా మంచి ఫలితాలు అందుకోలేరు. 12వ ఇంటిలో శని స్థానం ఉండటం వలన విదేశఈ దేశాలతో అనుసంధానం చేయబడిన వ్యాపారాలకు మాత్రం కొంత వరకు కలిసి వస్తుంది. ఇక వీరికి మే 17 నుంచి అక్టోబర్ 9 మధ్య కాస్త బాగుంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపారంలో కొంత వరకు లాభాలు అందుకుంటారు. తర్వాత మళ్లీ సమస్యలే ఎదురు అవుతాయి.  ఉద్యోగులు కూడా తమ కార్యాలయాల్లో సమస్యలు ఎదుర్కుంటారు. సీనియర్ల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది.

4 / 5
ఇక 2026లో మేష రాశి వారికి ప్రేమ జీవితం విషయానికి వస్తే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహం విషయంలో అనుకూల ఫలితాలను అందుకుంటారు. ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారి వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. బృహస్పతి సంచారం వలన వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగనుంది.

5 / 5