Bigg Boss 8 : బిగ్ బాస్ స్టేజ్ పైకి కొత్త జంట.. స్పెషల్ గెస్ట్‌లుగా నాగ చైతన్య, శోభిత

సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు నాగ చైతన్య. ఈ ఇద్దరూ కలిసి చాలా కాలంగా తిరుగారు. ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. నిశ్చితార్థం తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

Bigg Boss 8 : బిగ్ బాస్ స్టేజ్ పైకి కొత్త జంట.. స్పెషల్ గెస్ట్‌లుగా నాగ చైతన్య, శోభిత
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 05, 2024 | 10:45 AM

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట ఇటీవల హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు నాగ చైతన్య. ఈ ఇద్దరూ కలిసి చాలా కాలంగా తిరుగారు. ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. నిశ్చితార్థం తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ జంట త్వరలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’ స్టేజ్ పైకి రానున్నారని తెలుస్తోంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గత నెలలో జరిగింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం గోప్యంగా ఉంచారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూశారు. అప్పుడే సడన్ గా ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య, శోభిత బిగ్ బాస్ హౌస్‌కి గెస్ట్‌లుగా రాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ లో వారాంతంలో అతిథులను ఆహ్వానిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. అలాగే కొంతమంది తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు వచ్చారు.

ఇప్పుడు నాగ చైతన్య, శోభిత బిగ్ బాస్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ తో మాట్లాడతారా..? లేక బిగ్ బాస్ వేదికపైకి వచ్చి హోస్ట్ అక్కినేని నాగార్జునతో మాట్లాడతారా.? అనేది తెలియాల్సి ఉంది. నాగ చైతన్య, శోభిత ఇప్పటి వరకు కలిసి కనిపించలేదు. ఒక్కసారి బిగ్ బాస్ లోకి వస్తే కచ్చితంగా టీఆర్పీ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవలే ప్రారంభమైన సీజన్ 8 దూసుకుపోతోంది. ప్రస్తుతం హౌస్ లో 14మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు