Kalki: ఓటీటీలో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘కల్కి’.. ప్రపంచవ్యాప్తంగా

ఇక ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌ల నటన కూడా ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1200 కోట్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకొని రికార్డు కలెక్షన్లను రాబట్టింది...

Kalki: ఓటీటీలో సరికొత్త చరిత్ర సృష్టించిన 'కల్కి'.. ప్రపంచవ్యాప్తంగా
Kalki Ott
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2024 | 10:17 AM

‘కల్కి 2898 ఏడీ’.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో సంచలనం సృష్టించిందీ మూవీ. నాగ అశ్విన్‌ ప్రేక్షకులకు కొత్త ప్రంపచాన్ని చూపించారు. పురాణాలను, ఆధునిక భారతాన్ని మేలవించి నాగ అశ్విన్‌ సృష్టించిన సరికొత్త లోకానికి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు.

ఇక ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌ల నటన కూడా ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1200 కోట్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకొని రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి అసలు కథ సీక్వెల్‌లోనే ఉండనుంది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన కల్కి మూవీ.. ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఆగస్టు 22వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కల్కి మూవీ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సినిమా తాజాగా గ్లోబల్‌ రేంజ్‌లో సత్తా చాటింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌ అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌ సొంతం చేసుకున్న సినిమాగా కల్కి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

దీంతో ఈ సినిమా ప్రస్తుతం గ్లోబల్‌ ట్రెండింగ్‌లో మొదటిస్థానంలో నిలిచింది. ఓటీటీలోకి వచ్చిన రెండు వారాల్లో ఏకంగా 7.1 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది. విడుదలైన మొదటివారంలోనే 2.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం నాన్‌ ఇంగ్లిష్‌ విభాగంలో నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి స్థానంలో ఉండడం విశేషం. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కల్కిని భారీ మొత్తానికి కొనుగోలు చేసిందుకు బాగానే వర్కవుట్‌ అవుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే కల్కి సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తికాగా.. ఫుల్ లెంగ్త్ షెడ్యూల్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోది. మరి అసలు కథ అంతా ఉన్న సీక్వెల్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..