- Telugu News Photo Gallery Cinema photos Do you know how this actress, who played Mrunal's sister in Hi Nanna, is doing now
ఇది కదా అరాచకం అంటే..! హాయ్ నాన్న సినిమాలో ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
ఒకప్పుడు సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టాలంటే.. ఎన్నో రికమెండేషన్లు, ఫోటోషూట్స్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా ఒకటేమిటి ఆ లెక్కే వేరు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే చాలు.. దర్శకనిర్మాతలు ఆ ఇన్‌స్టా ప్రొఫైల్ చూసి డైరెక్ట్‌గా హీరోయిన్‌గా ఎంపిక చేసేస్తున్నారు.
Updated on: Dec 08, 2025 | 1:16 PM

ఒకప్పుడు సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టాలంటే.. ఎన్నో రికమెండేషన్లు, ఫోటోషూట్స్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా ఒకటేమిటి ఆ లెక్కే వేరు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే చాలు.. దర్శకనిర్మాతలు ఆ ఇన్‌స్టా ప్రొఫైల్ చూసి డైరెక్ట్‌గా హీరోయిన్‌గా ఎంపిక చేసేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఎంతోమంది అమ్మాయిలు రీల్స్, డ్యాన్స్ వీడియోలతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మేము కూడా అలాంటి ఓ ఇన్ఫ్లుయెన్సర్ గురించి చెప్పబోతున్నాం. నానితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.? ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి.. ఇప్పుడు నటిగా మారింది.

ఈమె ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇక ఇప్పుడు ఓ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగే తెలుగులో నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ సినిమాలో నటించింది. ఇంతకీ ఆ బ్యూటీ మరెవరో కాదు.. దృష్టి తల్వార్. ఈ ఢిల్లీ భామ 1998 ఆగస్టు 30న పుట్టింది. తొలుత టిక్ టాక్ వీడియోలు, ఆపై యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్‌తో మంచి సక్సెస్ అయింది.

తద్వారా మోడల్ నుంచి నటిగా మారింది. 2022లో పంజాబీ చిత్రం ‘చోబ్బర్’తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దృష్టి తల్వార్. ఒకవైపు పంజాబీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకుంది. అలా తెలుగులో ఆమెకు ‘హాయ్ నాన్న’లో నటించే అవకాశం దక్కింది.

ఇందులో మృణాల్ ఠాకూర్‌కు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు ప్రైవేటు సాంగ్స్‌లో కూడా నటిస్తోంది. తాజాగా ‘ఫ్లై’ అనే పంజాబీ పాటలో కనిపించింది ఈ వయ్యారి. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.




