అంతా తూచ్ నేను గర్భవతిని కాదు.. నటి పోస్ట్ పై నెటిజన్స్ ఫైర్
సోషల్ మీడియా వినియోగం ఎక్కువైంది. చాలామందికి సోషల్ మీడియా అనేది జీవితంలో ఓ భాగం అయ్యింది. పొద్దున్న లెగిస్తే సోషల్ మీదితోనే గడిపేస్తున్నారు కొందరు.. ఇక సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా వల్ల చాలా మంది నటీనటులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

పబ్లిసిటీ పిచ్చితో కొంతంమంది చేసే పనులు జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. చాలా మంది ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నారు కూడా.. కాగా ఇటీవల ఓ అమ్మడు తాను ప్రగ్నెంట్ అంటూ ఓ వీడియో, కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. పెళ్లి కాకుండానే తల్లి అయ్యిందా అని అందరూ షాక్ అయ్యారు. కొంతమంది ఆమెకు విషెస్ కూడా తెలిపారు కానీ.. ఆ నెక్ట్స్ డేనే అంతా తూచ్.. ఏప్రిల్ ఫూల్ అంటూ పోస్ట్ షేర్ చేసింది. దాంతో నెటిజన్స్ అందరూ షాక్ అయ్యారు. ఓరేంజ్ లో ఆమె పై ట్రోల్స్ చేస్తున్నారు. మరీ ఇంత చెండాలంగా ఏప్రిల్ ఫూల్స్ ను చేయాలా అంటూ సీరియస్ అవుతున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే.. హిందీలో ‘నషా’ సినిమాతో పరిచయమైంది పూనమ్. 1991లో కాన్ఫూర్‌లో పూనమ్ జన్మించింది. 2018లో నటించిన ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ ఆమెకు చివరి సినిమా. ఆతర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఆమె అనేక వివాదాల్లోనూ చిక్కుకుంది. 2022లో లాక్‌అప్ షోలో కంటెస్టంట్‌గా పూనమ్ కనిపించింది. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానంటూ సంచలనం సృష్టించింది. ఆ స్టేట్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.
ఆతర్వాత ఒకరితో సహజీవనం చేసింది.. అతను తనను విపరీతంగా కొట్టాడని.. ఆరోపించింది. ఇదిలా ఉంటే తాజాగా తాను ప్రగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అంతే కాదు బేబీ బంప్ తో ఫోటోలు కూడా షేర్ చేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. కాగా తాజాగా అంత తూచ్ ఇదంతా ఏప్రిల్ ఫూల్ అని మరో పోస్ట్ షేర్ చేసింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.
April 🌹 pic.twitter.com/veBJvaDCKo
— Poonam Pandey (@iPoonampandey) April 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
