Telangana: మీ వాహనానికి తప్పుడు చలానా పడిందా.? ఇలా చేస్తే ఈజీగా క్యాన్సిల్ అవుతుంది
మీ వాహనానికి కూడా తప్పుడు చలానా పడిందా.? అయితే ఇది మీకోసమే. తెలంగాణలో సాంకేతిక లోపాల కారణంగా వాహనదారులకు వస్తున్న తప్పుడు ఈ-చలానాలు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకోండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు వినియోగిస్తున్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు కొన్నిసార్లు వాహనదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. వాహనం ఇంట్లోనే ఉన్నా, తాము ఆ ప్రాంతానికే వెళ్లకపోయినా చలానాలు పడుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రధానంగా కెమెరాలు నంబర్ ప్లేట్‌ను సరిగ్గా గుర్తించకపోవడం వల్ల ఒక వాహనానికి పడాల్సిన చలానా మరొకరికి వెళ్తోంది. ఉదాహరణకు, ఒక అక్షరం లేదా అంకె స్పష్టంగా లేకపోతే, సాఫ్ట్‌వేర్ దానికి దగ్గరగా ఉన్న వేరే నంబర్‌ను తీసుకుంటోంది. దీనివల్ల నిబంధనలు పాటించే సామాన్యులు అకారణంగా జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ మీకు కూడా అలాంటి తప్పుడు చలానా పడినట్లయితే.. వెంటనే కంగారు పడకుండా ఇలా చేయండి సరిపోతుంది.
ఇది చదవండి: జేసీబీతో పొలంలో తవ్వకాలు జరుపుతుండగా.. బరువుగా తగిలిన కుండ.. బద్దలుకొట్టి చూడగా
ఆన్‌లైన్ ఫిర్యాదు: తెలంగాణ ట్రాఫిక్ ఈ-చలానా వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ చలానా నంబర్‌తో లాగిన్ అయి, అక్కడ ఉండే ‘Grievance’ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయాలి.
ప్రూఫ్స్ సమర్పించడం: మీ వాహనం ఫోటో, చలానాలో ఉన్న వాహనం ఫోటోలు వేరుగా ఉన్నాయని చూపిస్తూ ఆధారాలు అప్లోడ్ చేయాలి.
వాట్సాప్ లేదా హెల్ప్‌లైన్: సంబంధిత ట్రాఫిక్ పోలీస్ విభాగం(హైదరాబాద్, సైబరాబాద్ లేదా రాచకొండ) వాట్సాప్ నంబర్‌లకు కూడా సమాచారం అందించవచ్చు.
ఇది చదవండి: తెలంగాణలో స్కూల్స్‌కి వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.? ఈసారి భారీగానే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
