Mrunal Thakur: ఒక్క సినిమాతోనే రెమ్యూనరేషన్ పెంచేసింది.. ఏకంగా నయనతార, సమంతలను మించి డిమాండ్ చేస్తోన్న సీతారామం బ్యూటీ..
మొదటి సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలోనే ఆమె రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారట. సీతారామం సినిమా కోసం కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్న మృణాల్.. ఇప్పుడు నెక్ట్స్ మూవీస్ కోసం డబుల్ చేసిందట.
తెలుగులో తొలి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరోయిన్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా యూత్ లో మృణాల్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది. మొదటి సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలోనే ఆమె రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారట. సీతారామం సినిమా కోసం కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్న మృణాల్.. ఇప్పుడు నెక్ట్స్ మూవీస్ కోసం డబుల్ చేసిందట.
అయితే మృణాల్ రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న నిర్మాతలు కూడా ఇచ్చేందుకు వెనక్కు తగ్గడం లేదట. దక్షిణాదితోపాటు.. ఉత్తరాదిలోనూ ఆమె క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇప్పుడు మృణాల్ రెమ్యూనరేషన్ కు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆమె న్యాచురల్ స్టార్ నాని సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం మృణాల్ ఏకంగా రూ. 6 కోట్లు తీసుకుంటున్నారట. అంటే ఈ మొత్తం సౌత్ లో టాప్ హీరోయిన్స్ నయన్, సమంతలు తీసుకుంటున్న పారితోషికం కంటే ఎక్కువే. లేటేస్ట్ టాక్ ప్రకారం ఒక్కో సినిమాకు నయనతార, సామ్ రూ. 5 కోట్లు వసూళు చేస్తున్నారట. ఈ లెక్కన చూసుకుంటే సామ్, నయన్ కంటే మృణాల్ పారితోషికం ఎక్కువే.
దీంతో సౌత్ ఇండస్ట్రీలో తొలి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని.. రెమ్యూనరేషన్ విషయంలోనూ తగ్గేదే లే అంటోంది ఈ బాలీవుడ్ బ్యాటీ. అటు హిందీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది మృణాల్. హీరోయిన్ గానే కాకుండా.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ మెప్పిస్తోంది. గతంలో ఆమె అక్షయ్ హీరోగా వచ్చిన సెల్ఫీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రూ. కోటి తీసుకున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.