Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‏గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..

టాలెంటెడ్ హీరో నితిన్ (Nithiin) నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మేఘ ఆకాష్ (Megha Akash). అందం, అభినయంతోనే మొదటి

Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‏గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..
Mega Akash
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 15, 2022 | 7:31 AM

టాలెంటెడ్ హీరో నితిన్ (Nithiin) నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మేఘ ఆకాష్ (Megha Akash). అందం, అభినయంతోనే మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత చల్ మోహన్ రంగ సినిమాలో నటించింది. అయితే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం ఆశించినంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఇటీవల డియర్ మేఘ సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించింది. ఈ చిత్రానికి దర్శకుడు సుశాంత్ రెడ్డి కథ స్టోరీ అందించారు. అంతేకాకుండా.. నిర్మాణం లో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం తన తల్లి బిందు ఆకాష్ మరో సాహసం చేయబోతుంది.

మేఘ ఆకాష్ సినిమా కోసం ఆమె తల్లి బిందు ఆకాష్ నిర్మాతగా మారిపోయింది. సుశాంత్ రెడ్డి.ఏ & అభిషేక్ కోట నిర్మాణంలో, మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. మేఘ ఆకాష్ హీరొయిన్ గా రూపొందబోతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, “డియర్ మేఘ లాంటి హిట్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ తో మా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం పై చాలా అంచనాలున్నాయి. దర్శకుడు అభిమన్యు బడ్డి పై మాకు చాలా నమ్మకముంది. ముఖ్య నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నాం. షూటింగ్ కూడా అతి త్వరలో మొదలవుతుంది.” అన్నారు

Also Read: Rudra: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రుద్ర వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌.. నటనతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా..

Kalavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే తొలి పాటగా..

Vijay Beast: విజయ్‌ బీస్ట్‌ నుంచి లిరికల్‌ సాంగ్‌.. అదిరిపోయే స్టెప్స్‌తో మరోసారి ఆకట్టుకున్న ‘బుట్టబొమ్మ’..

Upasana: ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు’.. వాలంటైన్స్‌డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేసిన ఉపాసన..