AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megha Akash: వేదాంతం వల్లిస్తోన్న అందాల భామ.. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అంటూ..

Megha Akash: పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన నట వారసత్వం ఉన్నా తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార మేఘా ఆకాశ్‌....

Megha Akash: వేదాంతం వల్లిస్తోన్న అందాల భామ.. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అంటూ..
Megha Akash
Narender Vaitla
|

Updated on: Aug 29, 2021 | 4:06 PM

Share

Megha Akash: పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన నట వారసత్వం ఉన్నా తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార మేఘా ఆకాశ్‌. తొలి సినిమాలోనే మంచి నటనను కనబరిచిన ఈ చిన్నది వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంది. ఇక తెలుగులతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేసిన మేఘా.. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘రాధే’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే ‘చల్‌ మోహన రంగ’ చిత్రం తర్వాత తెలుగు తెరకు బ్రేక్‌ ఇచ్చింది మేఘా. 2018 తర్వాత మేఘా ఆకాశ్‌ మళ్లీ తెలుగులో నటించలేదు. ఈ విషయమై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మేఘా మాట్లాడుతూ.. సరైన కథలు దొరకని కారణంగానే తెలుగులో సినిమాకు ఓకే చెప్పలేదని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

ఇదిలా ఉంటే ఈ చిన్నది మళ్లీ రాజ రాజ చోరా అనే సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక తదుపరి ‘డియర్‌ మేఘా’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ అందాల తార నటించిన తాజా చిత్రం ‘డియర్‌ మేఘా’ సెప్టెంబర్‌ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మేఘా తాజాగా విలేకరులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా మేఘా కాస్త వేదాంతాన్ని చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ప్రణాళికలు వేసుకున్నానని చెప్పిన మేఘా.. కానీ, ఇక్కడ మన ప్రణాళికలకు అనుగుణంగా ఏది జరగదని అర్థమైందని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని కొన్నాళ్లకు తెలుసుకున్నానని వేదాంతాన్ని వల్లించింది. ఈ విషయమై మేఘా ఇంకా మాట్లాడుతూ.. ‘మొదట్లో నాకంటూ కొన్ని పరిమితులుండేవి. అందుకే తగ్గ పాత్రలే ఎంచుకుని సినిమాలు చేశా. కానీ, ఇప్పుడు నా ఆలోచనా విధానం మారింది. నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నా’ను అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక మేఘా ప్రస్తుతం తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది. మరికొన్ని చిత్రాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

Also Read: Sitara: మళ్లీ సందడి మొదలుపెట్టిన బెస్ట్ ఫ్రెండ్స్.. గోవా డైరీస్ అంటూ వచ్చేసిన ఏ అండ్ ఎస్..

Samantha: ఒక్క ట్వీట్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన సామ్.. ఏమని ట్వీట్ చేసిందంటే..

Drugs Case: నటుడి ఇంట్లో నిషేధిత డ్రగ్స్.. అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు..