బొడ్డు కనిపిస్తే తప్పేంటి.. నేను రాత్రిళ్లు ఏడ్చేదాన్ని.. మంచు లక్ష్మీ సెన్సేషనల్ కామెంట్స్
మంచు లక్ష్మి. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆమె.. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది. ఆమె కుటుంబంలో అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాగా.. సోదరులు మంచు విష్ణు, మంచు మనోజ్. సిద్ధార్థ్, శ్రుతిహాసన్ నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయమైంది.

అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. మొదటి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అంతకుముందు కొన్ని ఇంగ్లిష్ సీరియల్స్, టీవీషోస్ లోనూ సందడి చేసింది. దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూర్ టాకీస్, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా వింత గాథ వినుమా, పిట్ట కథలు, మాన్‌స్టర్ (మలయాళం) వంటి సినిమాల్లో నటిగా మెప్పించింది మంచులక్ష్మి. ఇటీవలే దక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. గతంలో లాగా ఇప్పుడు సినిమాలు చేయకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మీ..
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ జర్నలిస్ట్ వివాదాస్పద ప్రశ్న అడగడంతో ఆమె సీరియస్ అయింది. ఈ వయసులో మీరు ఎందుకు గ్లామరస్ గా డ్రస్సులు వేసుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె సీరియస్ అయ్యారు. అలాగే అతని పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా మంచు లక్ష్మీ పోడ్‌కాస్ట్ లో పాల్గొన్నారు..
ఆమె మాట్లాడుతూ.. నేను స్టార్ కిడ్‌నని.. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు రాలేదనుకోవడం చాలా పెద్ద పొరపాటు. కొన్ని సంఘటనలు, కొన్ని కామెంట్స్ విని నేను రాత్రిళ్లు ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చారు. మన దగ్గర సాంప్రదాయం అనే పేరుతో మహిళలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒక సీన్‌లో కొంచం బొడ్డు కనిపించినా కూడా విమర్శలు వస్తాయి. అందులో తప్పేముంది.. అది సినిమా సీన్ అని తెలిసి.. అలాగే అది ఆర్ట్ డిమాండ్ అని తెలిసి కూడా మహిళల శరీరాన్ని తప్పుగా చూస్తారు. నార్త్ లో ఇలా ఉండదు అక్కడ ప్రొఫెషనలిజం ఎక్కువ, వ్యక్తిగత విషయాల్లో జోక్యం తక్కువ. ప్రతి మహిళకు తన శరీరంపై నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. సర్జరీ చేయించుకోవడం తప్పేం కాదు. అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




