Telugu Actress: ముద్దు సీన్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన హీరోయిన్.. కానీ చివరకు.. ఇంతకీ ఆమె ఎవరంటే..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆమె.. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పుడు వయసు రీత్యా సహాయ నటిగా కనిపిస్తుంది. తాజాగా తన కెరీర్ తొలి రోజులను గుర్తుచేసుకుంది.

దక్షిణాది సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు మధుబాల. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాతో నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న మధు.. అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన మధు.. ఇప్పుడు సహయ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ రాణిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న పలు ఇబ్బందుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నటిగా తను కొన్ని షరతులు పెట్టుకున్నాని తెలిపారు. కానీ ఒక సినిమా కోసం తాను రూల్స్ బ్రేక్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ సీన్ చేశానని.. తీరా చూస్తే ఆ సన్నివేశాన్ని తొలగించారని చెప్పుకొచ్చింది.
మధుబాల మట్లాడుతూ.. “స్కిన్ షో లేదా ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చేది కాదు. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే కొన్ని సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాని.. అందుకే చాలా సినిమాలు వదులుకున్నాను. ఓ సినిమా కోసం రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ముద్దు సన్నివేశం చేయాలని టీమ్ చెప్పింది. అందుకు నేను ఒప్పుకోలేదు. కాకపోతే ఆ సీన్ చేయడం ముఖ్యమని చెప్పడంతో చేసేది లేక నటించాను. ఇబ్బందిపడుతూనే ముద్దు సీన్ చేశాను. అది నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. తీరా చూస్తే ఎడిటింగ్ సమయంలో ఆ సన్నివేశం అవసరంలేదని ఆ సీన్ తొలగించారు. ఆ విషయంలో దర్శకుడితో గొడవపడలేదు. సినిమా కోసం ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సి ఉంటుందని కొందరు నటీనటులను చూశాక నాకు అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చారు.
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
మధుబాల.. ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమను ఏలేసిన హీరోయిన్. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్స్ ఉన్న సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని.. ఆడిషన్స్ సైతం ఇచ్చానని తెలిపింది. కానీ ఆయన సినిమాలకు చివరకు వేరేవాళ్లను తీసుకున్నారని తెలిపింది. బాజీగర్ చిత్రంలోను తనకు ఫస్ట్ ఛాన్స్ వచ్చంది.. పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోవడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. అదే పాత్రలో శిల్పాశెట్టి నటించారని అన్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




