AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allam Gopala Rao: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు గోపాలరావు కన్నుమూత..

టాలీవుడ్ సీనియర్ నటులు, టీవీ ఆర్టిస్ట్ ఏ.గోపాలరావు శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మహాప్రస్తానంలో జరగనున్నాయి. గోపాలరావు తనయుడు అనిల్ ప్రస్తుతం పలు సీరియల్స్ చేస్తున్నారు.

Allam Gopala Rao: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు గోపాలరావు కన్నుమూత..
Gopalarao
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2025 | 2:39 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు, సినీ, టీవీ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గోపాలరావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ ఇప్పుడు సీరియల్స్ చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గోపాలరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు పలువురు సినీ, టీవీ ప్రముఖులు.

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గోపాలరావు ఇప్పటికీ పలు సీరియల్స్ లో కనిపిస్తుంటారు. మేఘ సందేశం, నిండు నూరేళ్ల సావాసం వంటి సీరియల్స్ లో నటించారు.

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

వెండితెరపై, బుల్లితెరపై కొన్ని వందల పాత్రలను పోషించినట్లుగా తెలుస్తోంది. బుల్లితెరపై టాప్ స్థానంలో దూసుకుపోయిన గుప్పెడంత మనసు సీరియల్ లో మంత్రిగా కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించారు గోపాలరావు. అలాగే ప్రస్తుతం ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్లో జడ్జ్ పాత్రలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. కొన్నాళ్లపాటు సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన గోపాలరావు.. గత పదేళ్లుగా ఎక్కువగా సీరియల్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..