మా నాన్న చనిపోయినప్పుడు ఎన్టీఆర్ మాటలు నాకు ఎంతో కంఫర్ట్ ఇచ్చాయి.. అప్పటి నుంచి నేను వీరాభిమానిని అయ్యా
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. ఫ్యాన్స్ పూనకాలతో ఉగిపోతుంటారు. ఇక ఎన్టీఆర్ డాన్స్ కు , నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇతర దేశాల్లోనూ ఎన్టీఆర్ కు క్రేజ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లోనూ తారక్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన టాలీవుడ్ లోనూ చాలా మంది సెలబ్రెటీలు కూడా ఎన్టీఆర్ కు అభిమానులే.. చాలా మంది చాలా సార్లు ఎన్టీఆర్ పై అబిమానంను చాటుకున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మాటలు తన జీవితంలో ఎంతో కంఫర్ట్ ఇచ్చింది అని తెలిపింది.
ఆమె ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలీ ప్రసాద్. 2016లో నేను సీతాదేవి అనే తెలుగు చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కోమలీ ప్రసాద్. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్ పి.సి. 524 , రౌడీ బాయ్స్, నెపోలియన్, హిట్: ది సెకండ్ కేస్ సినిమాలో నటించింది. హిట్ 2 చిత్రంలో ఆమె చేసిన ‘వర్ష’ పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే రీసెంట్ గా హిట్ 3లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. హిట్ 3 సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది.
హిట్ 3 సక్సెస్ అవ్వడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ.. మా నాన్న గారు చనిపోయిన తర్వాత నేను ఎన్టీఆర్ గారి స్పీచ్ విన్నాను. ఆ స్పీచ్ నాకు ఎంతో కంఫర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత నేను ఆయన సినిమాలు అన్ని చూశా.. ఆతర్వాత ఆయన పై ప్రేమ ఏర్పండింది. దాంతో నేను ఆయనకు పెద్ద అభిమానిని అయ్యాను అని చెప్పుకొచ్చింది కోమలీ ప్రసాద్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.