Sudigali Sudheer: వారసుడు వచ్చేశాడు.. సుడిగాలి సుధీర్ ఇంట పండుగ వాతావరణం
సుడిగాలి సుధీర్.. తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టీవీ షోస్ తో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అందుకు కారణమేంటో తెలుసుకుందాం రండి.

జబర్దస్త్ కామెడీ షో పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. సాధారణ కమెడియన్ ఈ టీవీ షోలో అడుగు పెట్టిన అతను టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు యాంకర్ గా కూడా అదరగొడుతున్నాడు. మరోవైపు సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సుధీర్ కుటుంబంలో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. అతని ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుడిగాలి సుధీర్ కు ఇంకా పెళ్లే కాలేదు కదా.. అప్పుడే వారసుడు ఎలా వచ్చాడు? అని అనుకుంటున్నారా? అసలు విషయమేమిటంటే.. సుధీర్ తమ్ముడు రోహన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య రమ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రోహన్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఇట్స్ బేబీ బాయ్’ అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రోహన్- రమ్య దంపతులుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సుడిగాలి సుధీర్ కు తమ్ముడు, చెల్లి ఉన్నారు. సోదరుడు రోహన్ ఇక్కడే ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. సోదరి శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాల్లో స్థిర పడింది.ఇక సుధీర్ తమ్ముడు రోహన్ కు రమ్యకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఇప్పటికే ఈ దంపతులకు పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. దీంతో సుధీర్ ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
సుధీర్ తమ్ముడు రోహన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. .. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, కాలింగ్ సహస్ర, గాలోడు సినిమాల్లో హీరోగా నటించాడు సుధీర్. ఇందులో గాలోడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. హీరోగా సుధీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం GOAT అనే సినిమాలో నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఈ మూవీ ప్రారంభమై చాలా రోజులైంది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు.
జబర్దస్త్ టీమ్ తో రోహన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.