Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్.

Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..
Keerthy Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 03, 2022 | 4:04 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నారు మేకర్స్. విడుదల తేదీ దగ్గర పడుతుండంతో మరోవైపు సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో తాను మహేష్ ను మూడు సార్లు కొట్టానని.. ఆ తర్వాత సారీ కూడా చెప్పినట్లు తెలిపింది.

మహేష్ బాబుతో షూటింగ్ చేయడం చాలా సరదా సరదాగా ఉంటుందని తెలిపింది. అలాగే ఓ సాంగ్ షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మర్చిపోయాయనని… అదే సమయంలో పొరపాటున మహేష్‏ను రెండు సార్లు మిస్ టైమింగ్‏తో కొట్టానని చెప్పింది. ఆ తర్వాత అందుకు సారీ చెప్పానని.. కానీ మూడో సారీ కూడా పొరపాటున కొట్టినట్లు చెప్పుకొచ్చంది. దీంతో తనపై ఏమైనా కోపం ఉందా ? అని మహేష్ బాబు తనను సరదాగా అడిగారని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Balakrishna : “మీ అకుంఠిత దీక్షకు నా సలాం”..ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

చున్నీ చాటున దాగి ఉన్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా..

Chiranjeevi :మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. సీనియర్ హీరోయిన్‌తో కలిసి సినిమా చేయనున్న మెగాస్టార్..

NBK 107: బాలయ్య- గోపీచంద్ సినిమా టైటిల్ ఇదేనా.. నెట్టింట వైరల్