AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: మరో ఛాలెజింగ్‌లో క్యారెక్టర్‌లో మహానటి.. పెళ్లి కాకముందే తల్లి అయ్యే పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్‌.?

Keerthy Suresh: 'మహానటి' సినిమాతో ఒక్కసారిగా యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకుంది అందాల తార కీర్తి సురేష్‌. సరైన పాత్ర దొరకాలే కానీ.. తన నట విశ్వరూపాన్ని చూపిస్తానని చాటి చెప్పింది....

Keerthy Suresh: మరో ఛాలెజింగ్‌లో క్యారెక్టర్‌లో మహానటి.. పెళ్లి కాకముందే తల్లి అయ్యే పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్‌.?
Narender Vaitla
|

Updated on: Aug 30, 2021 | 7:54 AM

Share

Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకుంది అందాల తార కీర్తి సురేష్‌. సరైన పాత్ర దొరకాలే కానీ.. తన నట విశ్వరూపాన్ని చూపిస్తానని చాటి చెప్పింది. ఈ సినిమా విజయం క్రెడిట్‌ వంద శాతం కీర్తికే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం. ఈ సినిమాతో కీర్తి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నది తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో 2021లో వచ్చి ‘మిమీ’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కీర్తిని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కీర్తితో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

నటనకు అత్యధిక ప్రాధాన్యత ఉండే ఈ పాత్రకు కీర్తి అయితేనే న్యాయం చేస్తుందని భావించిన చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయానికి వచ్చారని టాక్‌. కృతీసనన్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘మిమీ’ చిత్రం 2021లో విడుదలైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా. నటిగా కృతీని మరో మెట్టుపైకెక్కించదని చెప్పాలి. పెళ్లి కానీ ఓ యువతి తల్లిగా మారే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశసంలు సైతం అందుకుంది. మరి కీర్తి ఈ పాత్రకు ఓకే చెబుతుందా.? లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

‘మిమీ’ కథ ఏంటంటే..

సంతాన లేమి సమస్యతో బాధపడే ఓ విదేశీ జంట.. సరోగసీ విధానం ద్వారా బిడ్డను పొందాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డ్యాన్సర్‌ అయిన హీరోయిన్‌ (కృతీ) వారికి తారసపడుతుంది. దీంతో సరోగసి విధానాన్ని ఓకే చెప్పిన హీరోయిన్‌ పెళ్లి కాకముందే గర్భవతి అవుతుంది. తర్వాత ఈ విషయం ఇంట్లో తెలియకుండా ఉండడానికి.. సినిమా షూటింగ్‌ ఉందన్న పేరుతో 9 నెలల పాటు ముంబయిలో ఉంటానని చెప్పి ఇంటి నుంచి వెళుతుంది. అయితే కొన్ని వారాల తర్వాత రెగ్యులర్‌ పరీక్షలో భాగంగా చెక్‌ చేసిన వైద్యులు.. గర్భంలోని చిన్నారి ‘డౌన్‌ సిండ్రోమ్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతారు. దీంతో ఆ విదేశీ జంట వ్యాధితో బాధపడే బిడ్డ తమకు వద్దని చెప్పి.. అబార్షన్‌ చేసుకోమని చెప్పేసి అమెరికా వెళ్లిపోతారు. అయితే హీరోయిన్‌ మాత్రం అబార్షన్‌ చేసుకోకుండా బిడ్డకు జన్మనివ్వడానికే మొగ్గు చూపుతుంది. ఈ సమయంలో కుటుంబం, సమాజం నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. చివరికి ఏమైందన్నదే ఈ సినిమా కథ.

Also Read: Pelli SandaD: రాఘవేంద్రరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న అప్పటి సౌందర్య లహరి..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

Megastar Chiranjeevi: చిరకాల మిత్రుడిని కలుసుకున్న చిరంజీవి.. ప్రత్యేకమైన రోజంటూ ట్వీట్..